హరిత హైడ్రోజన్ ఉత్పత్తి సాంకేతికతను దేశీయంగా అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్), జర్మనీకి చెందిన హైడ్రోజన్ టెక్నాలజీ సంస్థ థిస్సెన్‌క్రుప్ నుసెరా ఇండియాలు కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
నీటి నుంచి హరిత హైడ్రోజన్‌ను వేరు చేసేందుకు ఉపయోగించే అత్యాధునిక ‘ఆల్కలైన్ వాటర్ ఎలక్ట్రోలైజర్’ వ్యవస్థల దేశీయ తయారీ, దశలవారీగా స్వదేశీకరణ లక్ష్యంగా ఈ రెండు సంస్థలూ చేతులు కలిపాయి. హైదరాబాద్ రామచంద్రాపురంలో ఉన్న భెల్ భారీ విద్యుత్ పరికరాల ప్లాంట్ (హెచ్‌పీఈపీ)లో వీటిని తయారు చేయనున్నారు.