వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల వల్ల తలెత్తే ఆర్థిక నష్టాల నుంచి బీమాదారులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వ రంగంలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘సర్వత్ర సురక్ష పారామెట్రిక్ పాలసీ’ పేరుతో ఈ బీమా పాలసీని విడుదల చేసింది.
సంప్రదాయ బీమా పద్ధతులకు, ఆధునిక రిస్క్ మేనేజ్‌మెంట్ పరిష్కారాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యమని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ జోషి వెల్లడించారు.