72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు 

72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు 
  • కేంద్ర ప్రభుత్వం 2026, జులై 18న 2024 ఏడాదికి సంబంధించి 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రకటించింది. ప్రముఖ మలయాళ సినీదర్శకుడు జయరాజ్‌ నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యూరీ ఈ అవార్డులను ఎంపిక చేసింది. ఇందులో తెలుగు సినీ దర్శకుడు వీఎన్‌ ఆదిత్య కూడా సభ్యుడిగా ఉన్నారు.
  • ఉత్తమ నటులుగా ప్రముఖ మలయాళ కథానాయకుడు మమ్ముట్టి (భ్రమయుగం), బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌(చందు ఛాంపియన్‌)లు నిలిచారు. ఉత్తమ నటిగా యామీ గౌతమ్‌ (ఆర్టికల్‌ 370) ఎంపికయ్యారు. జమ్మూకశ్మీర్‌ ఇతి వృత్తంతో రూపొందిన ‘ఆర్టికల్‌ 370’ ఉత్తమ చిత్ర గౌరవాన్ని దక్కించుకొంది. 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram