యాచకుల్లేని తొలి నగరంగా ఇందౌర్‌

యాచకుల్లేని తొలి నగరంగా ఇందౌర్‌

దేశంలోనే పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ ఇప్పుడు యాచకుల్లేని తొలి నగరంగా మరో ఘనత సాధించింది. భిక్షాటన రహితంగా మార్చి, యాచకులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా కార్యక్రమాలు చేపట్టి విజయం సాధించింది. రెండేళ్ల క్రితం ఇందౌర్‌లో రోడ్లు, కూడళ్ల వద్ద యాచించడాన్ని నిషేధించారు. ఎక్కడైనా యాచకులు కనిపిస్తే మహిళా, శిశు అభివృద్ధిశాఖ ప్రత్యేక బృందం వారిని పునరావాస కేంద్రానికి తరలిస్తుంది. అనంతరం వారి కుటుంబ సభ్యులను గుర్తించడం, వైద్య పరీక్షలు నిర్వహించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటి చర్యలు చేపడుతుంది. వీరి పిల్లల్ని గుర్తించి వారి ఆధార్‌ కార్డులు, ఇతర అవసరమైన పత్రాలు సిద్ధం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుంది.  

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram