వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా

వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా

వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలోని నార్త్‌ పోల్‌డోమ్‌ స్ట్రక్చర్‌లోని అత్యంత పురాతనమైన శిలల వయసు 302.4 కోట్ల సంవత్సరాలని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పరిశోధన ఆస్ట్రేలియాలోని కర్టిన్‌ యూనివర్సిటీ నిర్వహించింది. ఈ ప్రాంతంలోని రాళ్లను అంతరిక్షం నుంచి వచ్చిన ఓ భారీ ఉల్క దాదాపు 302.4 కోట్ల సంవత్సరాల క్రితం అత్యంత వేగంతో ఢీకొట్టిందని పేర్కొన్నారు. భూమిపై మొట్టమొదటి ఖండాలు.. ప్రాథమిక జీవం ఏర్పడుతున్న అత్యంత పురాతన కాలమైన ఆర్కియన్‌ యుగానికి చెందిన ఏకైక ఉల్కాపాత గుంత ఇదేనని తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు చెప్పారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram