హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఛైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఛైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌
  • కేంద్ర ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తమ కొత్త ఛైర్మన్‌గా నియమించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆర్థిక రంగ పునరుజ్జీవంలో కీలక పాత్ర పోషించిన రాజీవ్‌ను నాలుగేళ్ల పాటు స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బోర్డు ఆమోదముద్ర వేసింది.
  • 2026 జూన్‌ 30 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. రాజీవ్‌ 25వ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ)గా పనిచేసిన అత్యధిక మంది ఓటర్లు పాల్గొన్న ఎన్నికలను పర్యవేక్షించినందుకు ప్రపంచ రికార్డు దక్కించుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో నైతిక విలువలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన అతాను చక్రవర్తి స్థానాన్ని రాజీవ్‌ భర్తీ చేయనున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram