ఓపెన్‌ఏఐ ఎండీగా ప్రభ్‌జీత్‌

ఓపెన్‌ఏఐ ఎండీగా ప్రభ్‌జీత్‌

అమెరికా ఏఐ దిగ్గజం ఓపెన్‌ఏఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ప్రభ్‌జీత్‌ సింగ్‌ నియమితులయ్యారు. ప్రభ్‌జీత్‌ సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టనున్నారు. వినియోగదారు వృద్ధి, కంపెనీల అడాప్షన్, భాగస్వామ్యాలు, నియంత్రణ సంస్థలతో సమన్వయం తదితర భారత కార్యకలాపాలన్నిటినీ ఆయన పర్యవేక్షిస్తారు. ఐఐటీ ఖరగ్‌పుర్, ఐఐఎం అహ్మదాబాద్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆయన ఇటీవలి వరకు ఉబర్‌ కంపెనీకి భారత్, దక్షిణాసియా ప్రాంత ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఓపెన్‌ఏఐ 2025లో దిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram