భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మేనన్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) చేరుకున్నారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్ ఎంఎస్-29 వ్యోమనౌకలో ఇద్దరు రష్యన్ వ్యోమగాములు డుబ్రోవ్, అన్నా కికినాతో కలిసి ఆయన 2026, జులై 15న ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి 2026, జులై 14న వ్యోమనౌక విజయవంతంగా ప్రయాణమైంది.