ఈయరెండిల్‌-1

ఈయరెండిల్‌-1

రాత్రివేళా సూర్యకాంతిని అందించేందుకు అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ అనే సంస్థ సిద్ధమైంది. ఈయరెండిల్‌-1 అనే ఉపగ్రహాన్ని ఆ సంస్థ రోదసిలోకి పంపనుంది. దీని ద్వారా అంతరిక్షంలోకి ఒక భారీ అద్దాన్ని పంపేందుకు ఆ సంస్థకు అమెరికా ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (ఎఫ్‌సీసీ) నుంచి అనుమతి లభించింది. చీకటిపడ్డాక సూర్యకాంతిని భూమిపైకి పరావర్తనం చెందించే 60 అడుగుల అద్దాన్ని ఇది మోసుకెళుతుంది. 640 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది. 2026 చివర్లో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని రిఫ్లెక్ట్‌ సంస్థ అనుకుంటోంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram