బ్రిటన్ అతి పెద్ద సూపర్ కంప్యూటర్‌ను నిర్మిస్తోంది. సుమారు రూ.9,560 కోట్లతో (750 మిలియన్ పౌండ్లు) వెచ్చించి దీన్ని రూపొందిస్తోంది. ఎడిన్‌బరో శివార్లలో దీని నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. ఇది పూర్తయితే బ్రిటన్‌లోనే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్‌గా నిలవనుంది. అంతేకాకుండా మధ్య శ్రేణి సూపర్ మార్కెట్ అంత సైజు ఉండనుంది.
డాలీ గొర్రెను క్లోన్ చేసిన సంస్థకు సమీపంలోని మిడ్‌లోథియాన్ ప్రాంతంలో ఈ సూపర్ కంప్యూటర్‌ను నిర్మిస్తున్నారు.