పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్ రాకెట్ (ఎల్‌ఆర్‌జీఆర్)ను ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న సమీకృత పరీక్షా కేంద్రం నుంచి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) 2026, జులై 8న విజయవంతంగా పరీక్షించింది. ఈ ఫ్లైట్ టెస్టులో ఎల్‌ఆర్‌జీఆర్ అన్ని విన్యాసాలను ప్రణాళిక ప్రకారం ప్రదర్శించిందని, లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ వెల్లడించింది.