భారతీయ వ్యోమగాముల అంతరిక్ష యాత్ర ప్రాజెక్టు ‘గగన్‌యాన్’లో కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్‌డ్రాప్ టెస్ట్ (ఐమ్యాట్-05) పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో 2026, జులై 8న ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని శ్యోపుర్‌లో ఉన్న ఏరియల్ డెలివరీ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఆర్‌డీఈ) డ్రాప్ జోన్‌లో ఈ పరీక్ష చేపట్టారు. గగన్‌యాన్ వ్యోమగాములు అంతరిక్షయానం తర్వాత భూమికి తిరిగి వచ్చే క్రమంలో వారు ప్రయాణించే క్రూమాడ్యుల్ క్యాప్సుల్ సముద్రంలో దిగుతుంది. భూ వాతావరణంలో క్యాప్సుల్ వేగాన్ని తగ్గించే అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థల్లో పారాచూట్ వ్యవస్థ ఒకటి. ఇస్రో ఇప్పటికే నాలుగు దశల ఎయిర్‌డ్రాప్‌లను పరీక్షించగా, అయిదో పరీక్షను తాజాగా నిర్వహించింది.