చంద్రుడిపై వ్యోమనౌక దిగిన ‘శివశక్తి పాయింట్’ పరిధిలోని ప్రదేశం, చంద్రుడి నుంచి భూమిపైకి వచ్చి పడినట్లుగా తొలిసారిగా నిర్ధారణ అయిన ఉల్క మధ్య సారూప్యతలు ఉన్నట్లు తేలింది. జాబిల్లి దక్షిణ ధ్రువంలో మూడేళ్ల క్రితం అడుగుపెట్టిన చంద్రయాన్-3 అధ్యయనంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ సాగించిన విశ్లేషణల్లో ఇది వెల్లడైంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు 2026, జులై 4న వెల్లడించారు.