సూర్యుడిలో ‘ఐరన్‌ ఫ్లోరోసెన్స్‌’

సూర్యుడిలో ‘ఐరన్‌ ఫ్లోరోసెన్స్‌’
  • సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్‌ ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 అబ్జర్వేటరీ కీలక విషయాన్ని గుర్తించింది. భానుడిలో భారీగా సౌర జ్వాలలు చెలరేగిన సందర్భంలో ఐరన్‌ ఫోరోసెన్స్‌ను పరిశీలించింది. సౌర జ్వాలలు సూర్యుడి వెలుపలి వాతావరణమైన కరోనాను వేడెక్కిస్తాయి. దీనివల్ల శక్తిమంతమైన ఎక్స్‌రేలు వెలువడతాయి.
  • ఈ ఎక్స్‌రేలు చాలావరకూ సూర్యుడి వెలుపలికి వచ్చేస్తాయి. కొన్ని మాత్రం భానుడి లోపలికి పయనిస్తాయి. ఈ క్రమంలో అవి సూర్యుడి ఉపరితల పొర అయిన ఫొటోస్పియర్‌తో చర్యలు జరుపుతాయి. అక్కడ పుష్కలంగా ఉన్న న్యూట్రల్‌ ఐరన్‌ రేణువులను తాకినప్పుడు అవి ఎక్స్‌రే వెలుగు లేదా ఫ్లోరోసెన్స్‌ను కలిగిస్తాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram