బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నాయకుడు ఆండీ బర్న్‌హామ్ (56) 2026, జులై 20న బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఆయన అధికార లేబర్ పార్టీ పక్షనేతగా ఎన్నికయ్యారు. కీర్ స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. రాజు చార్లెస్-3తో భేటీ అనంతరం బర్న్‌హాం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు- రాజు చార్లెస్-3ను కలిసి కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా సమర్పించారు.