జపాన్‌లో ప్రస్తుతం శిశువుల సంఖ్య తగ్గిపోతూ వృద్ధులు గణనీయంగా పెరిగిపోతున్నట్లు వివిధ గణాంకాలు స్పష్ట చేస్తున్నాయి. ఆ దేశంలో 15 ఏళ్లలోపు పిల్లల జనాభా ఎన్నడూ లేనంత కనిష్ఠస్థాయికి (1,32,90,000) పడిపోయింది. మరోవైపు.. పెంపుడు కుక్కలు, పిల్లుల సంఖ్య 1.57 కోట్లకు చేరింది. ఇందులో 88.5 లక్షల పిల్లులు, 68.2 లక్షల కుక్కలు ఉన్నాయి. అంటే.. ఇప్పుడు జపాన్‌లో పిల్లల కంటే పెంపుడు జంతువుల సంఖ్య సుమారు 24 లక్షలు ఎక్కువ.