జిబ్రాల్టర్.. ఎన్నో యుద్ధాలకు, సార్వభౌమ వివాదాలకు, 13ఏళ్ల స్పెయిన్ బ్లాకేడ్‌కు కేంద్ర బిందువు. స్పెయిన్‌కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం సరిహద్దుల్లోని లా లైనియా డి లా పట్టణం నుంచి సైకిల్‌పై వెళ్లేంత దూరమే ఉంటుంది. కానీ బ్రిటన్ పాలనలో ఉంది. అందుకే స్పెయిన్‌వారు జిబ్రాల్టర్‌కు వెళ్లాలంటే అంతర్జాతీయ సరిహద్దును దాటాలి. అక్కడి వారు స్పెయిన్‌కు రావాలన్నా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రోజూ ఉద్యోగాల కోసం తిరిగేవారికి ఇది నరక ప్రాయమే. 118 ఏళ్ల నుంచి ఇదే కొనసాగుతోంది. ఇప్పుడీ జిబ్రాల్టర్ సరిహద్దు సంకెళ్లు తెగనున్నాయి. 2026, జులై 15 నుంచి అంతర్జాతీయ సరిహద్దును ఎత్తివేస్తున్నారు. దీంతో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కలగనుంది.
దీనివల్ల ఈయూ ప్రజలు స్పెయిన్ మీదుగా ఆంక్షల్లేకుండా జిబ్రాల్టర్‌కు వెళ్లవచ్చు. అక్కడి వారు ఈయూ దేశాల్లో ప్రయాణించవచ్చు.