ఐరోపాను బాలిస్టిక్ క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి ఉక్రెయిన్‌తోసహా 10 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పారిస్‌లో జరిగిన చర్చల అనంతరం 2026, జులై 13న కూటమిపై ప్రకటన వెలువడింది. రష్యాతో పోరాటంలో ఉక్రెయిన్ గడించిన అనుభవం తమకు పనికొస్తుందని కూటమి దేశాలు భావిస్తున్నాయి. ఐరోపాకు బాలిస్టిక్ క్షిపణి దాడుల నుంచి రక్షించే సమష్టి సామర్థ్యాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని కూటమి వెల్లడించింది.