ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు ఆ దేశ జాతీయ దిన స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొంటున్నారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించే తొలి ప్రధానిగా మోదీ నిలవనున్నారు. సీషెల్స్ కోస్టుగార్డుకు మేడిన్ ఇండియా గస్తీ నౌక పీఎస్ లెస్ప్‌వార్‌ను ప్రధాని మోదీ అందజేశారు. భారత్ హిందూ మహా సముద్ర ‘మహాసాగర్’ వ్యూహంలో సీషెల్స్‌ను కీలక భాగస్వామిగా భావిస్తోంది. ఇంకా సముద్ర జలాల్లో భద్రత, వాణిజ్యం, డిజిటల్ మౌలిక వసతులు, వాతావరణ సహకారంలో ఈ దేశం మనకు ఎంతో కీలకం.