ఉపాధి హామీ స్థానంలో వీబీజీరామ్‌జీ

ఉపాధి హామీ స్థానంలో వీబీజీరామ్‌జీ
  • మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గడువు దేశవ్యాప్తంగా జూన్‌ 30తో ముగిసింది. దాని స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, అజీవికా మిషన్‌-గ్రామీణ్‌ (వీబీజీరామ్‌జీ)’ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం అమలుకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు కేంద్రం రూ.3,825.31 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రం తన 40% వాటా కింద రూ.2550.21 కోట్లను వెచ్చించాలి.
  • ఉపాధిహామీలో గత ఏడాది కేంద్రం కేటాయించిన 8.50 కోట్ల పనిదినాల్లో రాష్ట్రం 8 కోట్ల పనిదినాలను మాత్రమే పూర్తి చేసింది. దీనిలో భాగంగా కొనసాగుతున్న మహిళాసంఘాల భవనాలు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, పాఠశాల గదులు, ప్రహరీలు లాంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు కేంద్రం అనుమతించింది. కొత్త పనులను మాత్రం జీరామ్‌జీ కిందే చేపట్టాలని పేర్కొంది. 
  • కూలీలు, పనుల వివరాలు, మస్టర్ల నమోదు, వేతనాల చెల్లింపులు, రికార్డులు పూర్తిగా జీరామ్‌జీ పేరిటే నిర్వహించాలి. దీనికి అనుగుణంగా కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఉన్న యాప్‌ల పేరు జీరామ్‌జీకి మార్చనున్నారు. ఉపాధి హామీలో ప్రతి కూలీకి 100 పనిదినాలు ఉండగా, జీరామ్‌జీలో 125 పనిదినాలు లభించనున్నాయి. వ్యవసాయ సీజన్‌లో రెండు నెలలు పనులు నిలిపివేసి విరామం ప్రకటించే సమయం ఏదో నిర్ణయించే అధికారాన్ని మాత్రం కేంద్రం రాష్ట్రాలకే ఇచ్చింది. జిల్లాలవారీగా కలెక్టర్లు దీన్ని నోటిఫై చేస్తారు. 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram