ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27

ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, లాం, గుంటూరులో అందుబాటులో ఉంది.  

వివరాలు:

బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ (B.Sc. (Hons.) (గతంలో బీఎస్సీ (ఆనర్స్) హోం సైన్స్‌గా పిలిచేవారు)

మొత్తం సీట్లు: 100

డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ అభ్యర్థులకు అదనంగా (Supernumerary): 10 సీట్లు 

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు

అర్హత: అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2)లో బైపీసీ, ఎంపీసీ లేదా ఎంబైపీసీ గ్రూపులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 3 సంవత్సరాల హోమ్ సైన్స్ డిప్లొమా లేదా ఆంగ్రూకు చెందిన వ్యవసాయం, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, హార్టికల్చర్, వెటర్నరీ (2 సంవత్సరాలు), అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (3 సంవత్సరాలు) డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు.

గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు 40% రిజర్వేషన్ ఉంది.

మహిళలకు ప్రతి కేటగిరీలో 33.3% రిజర్వేషన్ అమలులో ఉంటుంది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, ఎన్‌సీసీ, సీఏపీ, దివ్యాంగులు, క్రీడలు, స్కౌట్స్ & గైడ్స్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి

వయోపరిమితి: 17 నుంచి 22 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన అన్ని ధ్రువపత్రాలు, దరఖాస్తు ఫీజు చెల్లింపు రసీదు జతచేసి నిర్ణీత గడువులోపు రిజిస్ట్రార్, ఆంగ్రూ కార్యాలయానికి పంపించాలి. పూర్తి వివరాలతో దరఖాస్తు చేసిన అభ్యర్థులను మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్మీడియట్/డిప్లొమా మెరిట్ ఆధారంగా ఓపెన్ మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2000, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 10.08.2026.

Website:https://angrau.ac.in/ANGRU/ADMISSIONS_AY_2022_23.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram