బిట్స్ పిలానీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో పీహెచ్‌డీ ప్రవేశాలు

బిట్స్ పిలానీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో పీహెచ్‌డీ ప్రవేశాలు

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ), హైదరాబాద్ క్యాంపస్  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌), తిరుపతి సంయుక్తంగా నిర్వహిస్తున్న పీహెచ్‌డీ ప్రవేశాలు కోసం దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

సంయుక్త పీహెచ్‌డీ ప్రవేశాలు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్/కెమికల్ ఇంజినీరింగ్/నానోటెక్నాలజీ లేదా సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. నెట్‌/గేట్‌లో అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. క్యాటలిస్ట్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రోలైజర్ రంగంలో అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం.

ఫెలోషిప్: నెలకు రూ.37,000 + 30% హెచ్‌ఆర్‌ఏ (మొత్తం రూ.48,100).

పని చేసే స్థలం: బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్,  ఐఐఎస్ఈఆర్ తిరుపతి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్  ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 జులై 24.

Website:https://www.bits-pilani.ac.in/career/research-fellow-positions/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram