ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌

ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌

దేశవ్యాప్తంగా ఆయుష్‌ కళాశాలలు/ సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య కోర్సుల్లో ఎండీ, ఎంఎస్‌ కోర్సు ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2026 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది.  

వివరాలు:

ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2026

అర్హత: బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎస్‌ఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తయి ఉండాలి. 

పరీక్ష విధానం: ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. మొత్తం 120 మల్లిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం మార్కులు 480. 
పరీక్ష సమయం 2 గంటలు.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.2700. జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) రూ.2450. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ/థర్డ్ జెండర్‌ అభ్యర్థులకు రూ.1800. కు రూ.1800.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, సిద్దిపేట్‌/కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 10.07.2026. 

దరఖాస్తు చివరి తేదీ: 30.07.2026.

పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 30.07.2026.

దరఖాస్తు సవరణ తేదీలు: 01.08.2026 నుంచి 02.08.2026 వరకు.

పరీక్ష తేదీ: 22.08-2026.

Website: https://exams.nta.nic.in/aiapget/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram