జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు

దేశవ్యాప్తంగా 665 జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2027కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 15 జేఎన్‌వీలు ఉన్నాయి.  

వివరాలు:

జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2027

అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మొత్తం సీట్లలో కనీసం మూడో వంతు బాలికలకు కేటాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01-05-2015 నుంచి 31-07-2017 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. 

ప్రవేశ పరీక్ష: జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ ఎన్నిరాన్మెంటల్‌ స్టడీస్‌, అరిథ్‌మెటిక్‌, లాంగ్వేజ్‌ టెస్ట్‌) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఏపీలో తెలుగు/ ఆంగ్లం/ హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ ఒరియా/ కన్నడ మాధ్యమంలో, తెలంగాణలో తెలుగు/ ఆంగ్లం/ హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ కన్నడ మాధ్యమంలో ప్రవేశ పరీక్ష రాయవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్‌ ద్వారా  అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో విద్యార్థి ఫోటో, విద్యార్థి సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్ వివరాలు లేదా నివాస ధ్రువీకరణ పత్రం అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు (అవసరమైతే) అప్‌లోడ్ చేయాలి. అవసరమైతే సమీప జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచిత హెల్ప్‌డెస్క్ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2026 

ప్రవేశ పరీక్ష తేదీ: 28.09.2026.

ఫలితాల వెల్లడి: 2027, మార్చి/ఏప్రిల్‌.

Website:https://cbseitms.rcil.gov.in/nvs/Index

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram