ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పరిధిలోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నరోడా-బాపునగర్, అహ్మదాబాద్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.  

వివరాలు:

సీనియర్ రెసిడెంట్ - 20

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు /యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు  మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు , ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు  వయో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.67,700.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థల ఎంపిక ఉంటుంది.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 2026 జులై 23.

వేదిక: మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్, బాపునగర్, అహ్మదాబాద్, గుజరాత్.

Website: https://esic.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram