నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్‌ఎఫ్‌ఆర్‌ పరిధిలోని డివిజన్‌/ వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

యాక్ట్ అప్రెంటిస్: 6,777 పోస్టులు

వివరాలు:

పడివిజన్‌/ వర్క్‌షాప్‌ వారీగా ఖాళీలు: కతిహార్ & తింధారియా(1103), అలీపుర్‌దువార్(651), రంగియా(750), లుమ్‌డింగ్(1274), టిన్‌సుకియా(860), న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్(881), దిబ్రూగర్(763), ఎన్‌ఎఫ్‌ఆర్‌ హెడ్‌ క్వార్టర్‌/ మాలిగావ్(495).

విభాగాలు: ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, సీఓపీఏ, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, మెకానిక్‌ డిజిల్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ టెక్నీషియన్‌ తదితరాలు. 

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌కు 12వ తరగతి (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్‌: కనీస స్టైపెండ్‌ రూ.9,600; రెండో ఏడాది రూ.10,560; మూడో ఏడాది రూ.11,040. 

వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

ముఖ్య తేదీలు... 

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.07.2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 19.08.2026.

Website:https://www.rrcpryj.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram