డీఆర్‌డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్‌ పోస్టులు

డీఆర్‌డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్‌ పోస్టులు

మహారాష్ట్ర నాసిక్‌లో గల అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ఎనర్జిటిక్ మెటీరియల్స్ (ఏసీఈఎం), డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) 2026–27 సంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య - 41

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 30

2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ – 11 

విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ,  మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్/ఏరోనాటికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, తదితర విభాగాలు..

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఈ/బీటెక్‌, బీఎస్సీ, బీకాం, బీఎల్‌ఐఎస్‌లో  ఉత్తీర్ణులై ఉండాలి. 2024, 2025, 2026 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన ఫ్రెషర్లు మాత్రమే అర్హులు. 

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్  రూ.12,300 టెక్నీషియన్ (డిప్లొమా)అప్రెంటిస్ రూ.10,900.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా apprentice.acem@gov.in కు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 26-07-2026.

Website:https://xn--m1b0a2bb8esed.xn--11b7cb3a6a.xn--h2brj9c/drdo/hi/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram