భారత నౌకాదళంలో అగ్నివీర్‌వాయు మ్యూజిషియన్ పోస్టులు

భారత నౌకాదళంలో అగ్నివీర్‌వాయు మ్యూజిషియన్ పోస్టులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్‌) అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్‌) ఇన్‌టేక్‌ 01/2027 కోసం అవివాహిత భారతీయ పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) (01/2027) బ్యాచ్‌ 

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మేట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. సంగీతంలో ప్రావీణ్యం ఉండాలి. కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుంచి గ్రేడ్/డిప్లొమా లేదా సంగీత అనుభవ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01 జనవరి 2005 నుంచి 01 జులై 2009 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు.

జీతం: మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది రూ.33,000; 3వ ఏడాది రూ.36,000; 4వ ఏడాది రూ.40,000.+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. నాలుగు సంవత్సరాల సేవ అనంతరం సుమారు రూ.10.04 లక్షల సేవా నిధి ప్యాకేజ్ అందచేస్తారు.

ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ఇంగ్లిష్‌ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌, వైద్య పరీక్ష, తుది మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌:

పురుషులు: 1.6 కి.మీ పరుగును 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 10 పుష్-అప్స్, 10 సిట్-అప్స్, 20 స్క్వాట్స్.

మహిళలు: 1.6 కి.మీ పరుగును 8 నిమిషాల్లో పూర్తి చేయాలి. 10 సిట్-అప్స్, 15 స్క్వాట్స్.

రాత పరీక్ష: ప్రశ్నలు: 30 (ఇంగ్లిష్), వ్యవధి: 30 నిమిషాలు, 10వ తరగతి సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా, నెగెటివ్ మార్కింగ్ లేదు.

రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ కేంద్రాలు:

ఎయిర్ ఫోర్స్ స్టేషన్, న్యూదిల్లీ

7 ఏఎస్‌సీ, కబ్బన్ రోడ్, బెంగళూరు

వైద్య పరీక్ష కేంద్రాలు: 

11 ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్, హిండన్

ఎస్‌ఎంసీ, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జలహళి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.100+జీఎస్‌టీ.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 20.07.2026.

దరఖాస్తు చివరి తేదీ: 02.08.2026.

రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ: 31.08.2026 నుంచి 09.09.2026.

ప్రొవిజినల్‌ సెలెక్ట్‌ లిస్ట్‌: 14.11.2026.

తుది ఎన్‌రోల్మెంట్‌ జాబితా: 01.12.2026 తర్వాత.

Website:https://iafrecruitment.edcil.co.in/agniveervayu/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram