ఇండియన్‌ ఆర్మీ - 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు

ఇండియన్‌ ఆర్మీ - 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు

భారత సైన్యం.. 2027 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సులో చేరడానికి అర్హత గల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  

వివరాలు:

షార్ట్‌ సర్వీస్‌ కమీషన్‌ (టెక్‌)-68 పురుషులు- 350 పోస్టులు

ఇంజినీరింగ్ విభాగాలు: 

సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, ఎంఐఎస్సీ ఇంజినీరింగ్‌ విభాగాలు.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిర్ణీత తేదీలోపు డిగ్రీ పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలి. కేవలం నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇంజినీరింగ్ బ్రాంచ్‌లకే అర్హత ఉంటుంది.

ఫిజికల్ స్టాండర్డ్స్: 

పురుషులు- 2.4 కి.మీ. పరుగు 10.30 నిమిషాల్లో, పుష్-అప్స్ 40, పుల్-అప్స్ 6; సిట్‌ అప్స్‌- 30, ఈతలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి: 01.04.2027 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య (01 ఏప్రిల్‌ 2000 - 01 ఏప్రిల్ 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి).

జీతం: రూ.56,100 - రూ.1,77,500.

ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్: రూ.56,100.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, గ్రాడ్యుయేషన్‌ మార్కులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ(స్టేజ్‌-1, స్టేజ్‌-2), వైద్య పరీక్షలు, మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులు ప్రారంభం: 09.07.2026.

దరఖాస్తు చివరి తేదీ: 07.08.2026.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ కేంద్రాలు: ప్రయాగ్‌రాజ్‌, భోపాల్, బెంగళూరు, జలంధర్‌.

Website:https://www.joinindianarmy.nic.in/Authentication.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram