టీజీపీఎస్సీ- అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగాలు

టీజీపీఎస్సీ- అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర టౌన్‌ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నియామకానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

వివరాలు:

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్- 10 పోస్టులు 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  బీఆర్క్‌/ బీఈ/బీటెక్ (సివిల్‌) లేదా  బీ.ప్లానింగ్‌/ బీటెక్‌ (ప్లానింగ్‌) లేదా ఎం.ఏ లేదా ఎం.ఎస్సీ(జాగ్రఫీ)/ ఎంఎస్సీ (జియోఇన్ఫర్మేటిక్స్‌), పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి.

(ఓపెన్ యూనివర్సిటీ/దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీలు తప్పనిసరిగా యూజీసీ/ ఏఐసీటీఈ/ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ద్వారా గుర్తింపు పొంది ఉండాలి.)

గరిష్ఠవయోపరిమితి: 18 నుంచి 44 ఏళ్ల వరకు ఉండాలి.

వయో సడలింపులు: (ఎస్సీ/ ఎస్టీ/బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు: వారి సర్వీస్ కాలపరిమితి ఆధారంగా గరిష్ఠంగా ఐదేళ్లు; మాజీ సైనికోద్యోగులు/ ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు: మూడేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500.

జీతం: నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

పేపర్‌-I, పేపర్-II రెండూ 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 

రాత పరీక్ష: అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్షను  ఓఎంఆర్‌  ఆధారిత ఆఫ్‌లైన్ విధానంలో లేదా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 10/07/2026.

దరఖాస్తుకు చివరి తేదీ: 17/08/2026.

హాల్ టికెట్ల డౌన్‌లోడ్: పరీక్ష తేదీకి 7 రోజుల ముందు నుంచి.

పరీక్ష నిర్వహణ: అక్టోబరు 2026.

Website:https://www.tgpsc.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram