ఎస్‌వీపీయూఏటీ మేరఠ్‌లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

ఎస్‌వీపీయూఏటీ మేరఠ్‌లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్ అండ్‌ టెక్నాలజీ, మేరఠ్‌ (ఎస్‌వీపీయూఏటీ) వివిధ కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన నాన్‌ టీచింగ్‌ ఉగ్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య:- 62

వివరాలు: 

1. ఫార్మ్ మేనేజర్- 06

2. ప్రోగ్రామ్ అసిస్టెంట్- 07

3. ప్రాగ్రామ్ అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్)-11

4. అసిస్టెంట్- 08

5. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III-06

6. డ్రైవర్ /టీ1-24

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి పదోతరగతి/ఇంటర్‌/ ఐటీఐ/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠవయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: నెలకు డ్రైవర్‌ పోస్టుకు రూ. 21,700 నుంచి రూ. 69,100; స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III- రూ. 25,500 నుంచి రూ. 81,100; ఇతర పోస్టులకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌/ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 03.08.2026

యూనివర్సిటీకి హార్డ్ కాపీలు చేరడానికి చివరి తేదీ: 17.08.2026.

చిరునానమా: ది డైరెక్టర్, అడ్మినిస్ట్రేషన్ అండ్‌ మానిటరింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ యూనివర్సిటీ అఫ్ అగ్రికల్చర్ అండ్‌ టెక్నాలజీ, మోదీపురం, మేరఠ్‌. 

Website:https://www.recruitmentsvpuat.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram