రైల్వేలో టెక్నీషియన్ పోస్టులు

రైల్వేలో టెక్నీషియన్ పోస్టులు

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలోని వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ ప్రకారం జూన్‌ 30వ తేదీన పూర్తి నోటిఫికేషన్‌ విడుదలకానుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 6,565

వివరాలు:

1. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 323 పోస్టులు

2. టెక్నీషియన్ గ్రేడ్-III: 6,242 పోస్టులు

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.

అర్హత: టెన్త్‌, ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్-Iకు రూ.29,200; టెక్నీషియన్ గ్రేడ్-IIIకు రూ.19,900.

వయోపరిమితి: టెక్నీషియన్ గ్రేడ్-Iకు 18-33 ఏళ్లు; టెక్నీషియన్ గ్రేడ్-IIIకు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 3.06.2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.07.2026.

Website:https://www.rrbapply.gov.in/#/auth/landing

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram