ఎన్టీపీసీ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

ఎన్టీపీసీ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

భారత్ లోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ కాంట్రాక్ట్స్ అండ్‌ మెటీరియల్స్ విభాగంలో అనుభవం ఉన్న నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

ఇంజినీర్‌ (కాంట్రాక్ట్స్‌ & మెటీరియల్స్‌): 25

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ప్రొడక్షన్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బి.ఇ/బి.టెక్ పూర్తి చేసి ఉండాలి. మెటీరియల్స్ లేదా సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ/పీజీడీబీఎం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

గరిష్ఠ వయోపరిమితి: 32 ఏళ్లు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ & దివ్యాంగులకు వయోసడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష & పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మే 25.

Website:https://careers.ntpc.co.in/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram