ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త. వాతావరణ రంగంపై అనేక పరిశోధనలు చేశారు.
ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త. వాతావరణ రంగంపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా సౌర వికిరణం, ఓజోన్, పవన శక్తి లాంటివి ఇందులో ఉన్నాయి. వాతావరణ పరికరాలు (meteorological instrumentation) అభివృద్ధి చేశారు. వర్షాలు, తుపానుల ముందస్తు అంచనాకు ఇవి ఎంతగానో తోడ్పాటు అందించాయి. ఈ కారణాలతోనే ఆమెను ‘వెదర్ విమెన్ ఆఫ్ ఇండియా’/ ‘మదర్ ఆఫ్ ఇండియన్ వెదర్ ఫోర్‌కాస్ట్’గా పిలుస్తారు. భారత వాతావరణ శాఖ అభివృద్ధికీ ఈమె ఎంతగానో కృషి చేశారు. భారత తొలితరం శాస్త్రవేత్తల్లో ఒకరైన అన్నా మణి జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
అన్నా మణి 1918, ఆగస్టు 23న కేరళలోని పీరుమేడులో సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆమెకు పుస్తకాలు చదవడం అంటే విపరీతమైన ఇష్టం. ఎంతలా అంటే.. తన ఎనిమిదో పుట్టిన రోజున తల్లిదండ్రులు డైమండ్ రింగ్స్ బహుమతిగా ఇస్తే, అవి వద్దని.. ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (Encycloaedia Britannica)’ కావాలని గొడవ చేసేంత. 12 ఏళ్లకు స్థానిక లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివారు.
వాతావరణ రంగానికి చేసిన కృషి
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక కూడా సాధారణ శాస్త్రీయ పరికరాల కోసం ఇతర దేశాలపైనే ఆధారపడేది. ఈ పరిస్థితిని మార్చి, శాస్త్రీయ రంగంలో భారత్‌ను స్వావలంబన సాధించేలా చేయాలని అన్నా మణి సంకల్పించారు. ఫలితంగా 100 కంటే ఎక్కువ వాతావరణ పరికరాలకు ఆమె రూపకల్పన చేశారు. వీటిలో పైరనో మీటర్లు, విండ్ స్పీడ్ ట్రాకర్లు, రేడియేషన్‌ను కొలిచే పరికరాలు ఉన్నాయి. బారోమీటర్లు, థర్మామీటర్లు లాంటి విభిన్న వాతావరణ పరికరాల ప్రామాణీకరణకు నాయకత్వం వహించారు.
పురస్కారాలు - గౌరవాలు
ఈమె ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ), ఇండియన్ నేషన్ సైన్స్ అకాడమీ, అమెరికన్ మెటియోరోలాజికల్ సొసైటీ, ఇంటర్నేషనల్ సొలార్ ఎనర్జీ సొసైటీ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ మెటియోరోలజీ అండ్ అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్ లాంటి శాస్త్రీయ సంఘాల్లో సభ్యురాలిగా ఉన్నారు.
రచించిన పుస్తకాలు
అన్నా మణి మూడు పుస్తకాలను రచించారు. భారతదేశ వాతావరణశాస్త్ర అధ్యయనంలో అవి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నాయి. అవి:
చివరగా..
నాటి సమాజంలోని కట్టుబాట్లను ఎదిరించి, చదువుపై ఉన్న మక్కువతో ఉన్నత విద్యను అభ్యసించిన ధీశాలి అన్నా మణి. తన ఆవిష్కరణలతో దేశ స్వావలంబనకు కృషి చేశారు. భారత వాతావరణ విభాగం అభివృద్ధికి అన్నా మణి ఎంతగానో తోడ్పడ్డారు. కేవలం విద్య, విజ్ఞాన సముపార్జన; వాతావరణశాస్త్ర అభివృద్ధిపైనే దృష్టి సారించిన ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. గాంధేయవాది అయిన ఆమె మహాత్ముడి వైకోమ్ సత్యాగ్రహం నుంచి పొందిన స్ఫూర్తితో కేవలం ఖాదీ వస్త్రాలను మాత్రమే ధరించేవారు. అన్నా మణి 2001, ఆగస్టు 16న తిరువనంతపురంలో మరణించారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q: ‘వెదర్ విమెన్ ఆఫ్ ఇండియా’ అని కింది ఎవరిని పిలుస్తారు? (ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2022)
1) అన్నా మణి 2) వి.శాంతా
3) అదితి పంత్ 4) టెస్సీ థామస్
సమాధానం: 1
Q: అన్నా మణి భారతదేశ మొట్టమొదటి ‘ఓజోన్‌సోండే బెలూన్’ను కింది ఏ సంవత్సరంలో ఆవిష్కరించారు? (యూపీ టీజీటీ బయాలజీ, 2013)
1) 1962 2) 1963 3) 1964 4) 1965
సమాధానం: 3
Q: అన్నా మణి కింది ఏ రాష్ట్రంలో జన్మించారు? (ఆర్‌ఎస్‌ఎంఎస్‌ఎస్‌బీ అగ్రికల్చర్ సూపర్‌వైజర్, 2021)
1) తమిళనాడు 2) ఉత్తర్ ప్రదేశ్
3) కేరళ 4) మహారాష్ట్ర
సమాధానం: 3