ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త. లెవోయిజర్ దహన చర్యల గురించి అధ్యయనం చేశారు. మూలకానికి నిర్వచనం ఇచ్చారు. ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించారు.
ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త. లెవోయిజర్ దహన చర్యల గురించి అధ్యయనం చేశారు. మూలకానికి నిర్వచనం ఇచ్చారు. ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించారు. దహన, శ్వాసక్రియకు సహకరించే వాయువు పాత్రను కనుక్కుని, దానికి ఆక్సిజన్ అని పేరుపెట్టారు. హైడ్రోజన్, సల్ఫర్‌ను మూలకాలుగా గుర్తించారు. మొదటి సమగ్ర మూలకాల జాబితాను తయారు చేశారు. పదార్థం స్థితి, ఆకారంలో మార్పు వచ్చినా ద్రవ్యరాశిలో ఎలాంటి మార్పు ఉండదని నిరూపించారు. ఈయన్ను ఆధునిక రసాయనశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. పోటీపరీక్షల కోణంలో లెవోయిజర్ జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
పూర్తి పేరు ఆంటోనీ లారెంట్ డి లెవోయిజర్. 1743, ఆగస్టు 26న పారిస్‌లో జన్మించారు. 1754లో పారిస్‌లోని కాలేజ్ డెస్ క్వాట్రే-నేషన్స్‌లో పాఠశాలలో చేరారు. అక్కడ ప్రముఖ ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త అబ్బే నికోలస్ లూయిస్ డి లాకైల్ మార్గదర్శకత్వంలో అనేక విషయాలు నేర్చుకున్నారు. సహజ తత్వశాస్త్రం, గణితం, రసాయనశాస్త్రం, ఖగోళశాస్త్రం అభ్యసించారు. ఆ సమయంలోనే ఆయనకు సైన్స్‌పై ఆసక్తి కలిగింది.
తన తండ్రి కోరిక మేరకు 1761లో పారిస్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు చేరారు. ‘లా’ కోర్సుతోపాటే ఆయన కెమిస్ట్రీ, జాగ్రఫీపై ఆసక్తిని కొనసాగించారు. 1763లో బ్యాచిలర్ డిగ్రీ, 1764లో లాయర్‌గా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందారు.
1768లో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు తాత్కాలిక సభ్యుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది ఫెర్మ్ జనరల్ అనే ప్రైవేట్ సంస్థలో వాటాదారు అయ్యారు. ఇది ఫ్రెంచ్ రాచరికం కోసం రైతుల వద్ద నుంచి పన్నులు వసూలు చేసే సంస్థ.
తన ప్రయోగాల ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని లెవోయిజర్ భావించారు. అందుకు అనుగుణంగా ఆయన పట్టణ లైటింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, గాలి నాణ్యత మెరుగుపరచడం, తాగునీటి శుద్ధి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు.
నాటి ఫ్రెంచ్ రాచరిక పాలనలో అనేక పరిపాలనా మండళ్లలో సభ్యుడిగా పనిచేశారు. వ్యవసాయం, విద్య, ఆర్థిక సంబంధ కమిషన్లు అందులో ఉన్నాయి. తూనికలు, కొలతల సంస్కరణల్లో పాల్గొన్నారు.
ముఖ్యమైన పరిశోధనలు - ఆవిష్కరణలు
1770-80 కాలంలో చేసిన పరిశోధనల ద్వారా దహన - శ్వాసక్రియ, కాల్సినేషన్‌లో ఆక్సిజన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని గుర్తించారు. 1777లో ప్రాణవాయువుకు ‘ఆక్సిజన్’ అనే పేరు పెట్టారు. 1783లో ‘హైడ్రోజన్’ పదాన్ని రూపొందించారు. నీరు ఒక మూలకం కాదని ఆక్సిజన్, హైడ్రోజన్ సమ్మేళనమని నిరూపించారు.
గమనిక: ఇంగ్లండ్‌కి చెందిన జోసెఫ్ ప్రీస్ట్‌లీ1774లో ఆక్సిజన్‌ను కనిపెట్టారు. ఆయన దాన్ని ‘డీఫ్లాజిస్టికేటెడ్ ఎయిర్’ అని పిలిచారు.
1789లో ఆయన ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించారు. రసాయన ప్రతిచర్యల సమయంలో ద్రవ్యరాశి సృష్టి జరగదు అలాగే నాశనం కావని ఇది నిరూపించింది.
ఆ కాలంలో రసాయనాలకు పేరు పెట్టడానికి హేతుబద్దమైన వ్యవస్థ లేదు. ఇందుకోసం ఆయన రసాయన కూర్పు ఆధారంగా బైనరీ నామకరణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రసాయన ప్రతిచర్యల ద్వారా విభజితం కాని 55 పదార్థాల జాబితాను లెవోయిజర్ రూపొందించారు. వీటినే మూలకాలు అని పిలిచారు. నీరు, భూమి, గాలి వేర్వేరు మూలకాల రసాయన సమ్మేళనాలని ఆయన పేర్కొన్నారు.
చివరగా
రసాయనశాస్త్రాన్ని కచ్చితమైన, పరిమాణాత్మక శాస్త్రం వైపు మార్చడంలో లెవోయిజర్ ముఖ్య పాత్ర పోషించారు. తన ప్రయోగాల ద్వారా కెమిస్ట్రీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందించారు. 1789లో రాచరిక, భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో ‘ఫ్రెంచ్ విప్లవం’ ప్రారంభమైంది. 1792లో ఫ్రాన్స్ గణతంత్ర రాజ్యంగా మారింది. తర్వాత రాజు సహా అనేక మందిని ఉరితీశారు. ఆంటోని లెవోయిజర్ నాటి రాచరిక వ్యవస్థలో పెద్ద స్థాయిలో పదవులు నిర్వహించారు. సహజంగానే ఆయనపై విప్లవకారుల్లో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఆయన భాగస్వామిగా ఉన్న ‘ఫెర్మ్ జనరల్ సంస్థ’ రైతుల వద్ద నుంచి అక్రమంగా పన్ను వసూలు చేసిందనే నెపంతో 1784, మే 8న ఆయన్ను ఉరి తీశారు. నిజానికి ఆయన ప్రజల కోసం అనేక ఉపయోగకర కార్యక్రమాలు చేశారు. ఆధునిక రసాయనశాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఆయన మరణించిన కొంతకాలానికి ప్రభుత్వం లెవోయిజర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. మార్గదర్శక శాస్త్రవేత్తగా ఆయన ఖ్యాతిని పునరుద్ధరించింది.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. 1789లో రసాయనశాస్త్ర అభివృద్ధికి ఆంటోని లెవోయిజర్ చేసిన అతి ముఖ్యమైన ప్రతిపాదన ఏమిటి?
3) కచ్చితమైన నిష్పత్తుల నియమం 4) శక్తి పరిరక్షణ నియమం
సమాధానం: 1
2. ఆంటోని లెవోయిజర్ రాసిన ‘మెథడ్స్ ఆఫ్ కెమికల్ నోమెన్‌క్లేచర్’ పుస్తకం ఎప్పుడు ప్రచురితమైంది? (ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1, 2023)
1) 1783 2) 1780 3) 1790 4) 1787
సమాధానం: 4
3. Antoine Laurent Lavoisier was well known for his discovery of: (AAI ATC Junior Executive, 2022) 1) accurate atomic weights for the chemical elements 2) a systematic relation between wave-length and atomic number 3) oxygen's role in combustion and respiration. 4) a new metal - cobalt Answer: 3
4. In which year did Antoine Lavoisier publish 'Methods of Chemical Nomenclature', which included the rules for naming chemical compounds that are still in use today? (SSC CGL Tier-I, 2023) 1) 1783 2) 1780 3) 1790 4) 1787 Answer: 4
ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఆవిష్కర్త, శాస్త్రవేత్త. టెలిఫోన్ సృష్టికర్తగా సుపరిచితులు. అంతేకాక ధ్వనిశాస్త్రం, స్పీచ్ సైన్స్, ఆప్టిక్స్, మెరైన్ ఇంజినీరింగ్, ఏరోనాటిక్స్ రంగంలో విశేష పరిశోధనలు చేశారు.
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ జంతుశాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త. జువాలజీ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. భూమిపై అప్పటి వరకు గుర్తించని అనేక కొత్త రకం జాతులను కనుక్కుని, వాటికి పేర్లు పెట్టి, వాటి వంశానుక్రమాన్ని మ్యాప్ చేశారు.
ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ప్రయోగాత్మక రసాయనశాస్త్రం (experimental chemistry), విద్యుత్ - వాయువుల రసాయనశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు జోసెఫ్ ప్రిస్ట్‌లీ ప్రసిద్ధి చెందారు