ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

జోసెఫ్‌ ప్రిస్ట్‌లీ

ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ప్రయోగాత్మక రసాయనశాస్త్రం (experimental chemistry), విద్యుత్‌ - వాయువుల రసాయనశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు జోసెఫ్‌ ప్రిస్ట్‌లీ ప్రసిద్ధి చెందారు


ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ప్రయోగాత్మక రసాయనశాస్త్రం (experimental chemistry), విద్యుత్‌ - వాయువుల రసాయనశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు జోసెఫ్‌ ప్రిస్ట్‌లీ ప్రసిద్ధి చెందారు. ఆక్సిజన్, కార్బన్‌ డైఆక్సైడ్‌ లాంటి వాయువులను కనుక్కోవడంతోపాటు వాటిని ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేశారు. 150 కంటే ఎక్కువ పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఆధునిక రసాయనశాస్త్రానికి పునాది వేసిన ముఖ్యుల్లో ఒకరిగా నిలిచారు. ఫిబ్రవరి 6న జోసెఫ్‌ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • జోసెఫ్‌ ప్రిస్ట్‌లీ 1733, మార్చి 24న ఇంగ్లండ్‌లోని బిర్‌స్టాల్‌లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన తెలివైనవాడిగా అందరిలో గుర్తింపు పొందారు.  
  • మొదట స్థానిక పాఠశాలలో చేరి గ్రీక్, లాటిన్, హిబ్రూ నేర్చుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకు సైన్స్‌ విషయాల పట్ల ఆసక్తి కలిగింది.  
  • 1949లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పుడు యార్క్‌షైర్‌లోని హాప్టన్‌లో కాంగ్రిగేషనల్‌ మినిస్టర్‌ అయిన రెవరెండ్‌ జార్జ్‌ హాగర్‌స్టన్‌ ఈయనకు గణితం, సహజ తత్వశాస్త్రం, తర్కం, మెటాఫిజిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. ఆయన జోసెఫ్‌కు జీన్‌ లాక్‌ (ప్రముఖ ఆంగ్ల తత్వవేత్త), ఐజాక్‌ వాట్స్‌ (వేదాంతవేత్త), విల్లెం గ్రేవ్‌సాండే (గణిత శాస్త్రవేత్త) లాంటి ప్రముఖుల రచనలను ఇచ్చారు. ఇవి జోసెఫ్‌పై ఎంతో ప్రభావం చూపాయి.

ముఖ్యమైన పరిశోధనలు - ఆవిష్కరణలు

  • 1767లో కార్బన్‌ డైఆక్సైడ్‌ని నీటికి కలిపేందుకు ఆయన ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. ఫలితంగా కార్బొనేటెడ్‌ (సోడా) వాటర్‌ ఏర్పడింది. దీనికి గానూ ఆయనకు రాయల్‌ సొసైటీ నుంచి పతకం లభించింది.
  • 1774లో ఆయన ఆక్సిజన్‌ను కనుక్కున్నారు. మెర్క్యూరిక్‌ ఆక్సైడ్‌ను వేడిచేసే సమయంలో విడుదలైన వాయువే ఆక్సిజన్‌ అని ఆయన గుర్తించారు. 

అవార్డులు - గౌరవాలు

  • 1766లో లండన్‌లోని రాయల్‌ సొసైటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
  • 1772లో రాయల్‌ సొసైటీ ఆయనకు కోప్లీ మెడల్‌ను ప్రదానం చేసింది.
  • 1782లో అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌కు విదేశీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
  • 1922లో అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ (ఏసీఎస్‌) ఆయన పేరుతో ‘ప్రిస్ట్‌లీ మెడల్‌’ను స్థాపించింది. అమెరికాలో కెమిస్ట్రీ రంగంలో ఇచ్చే అత్యున్నత పతకం ఇది. 

చివరగా

  • రసాయనశాస్త్ర అభివృద్ధి కోసం జోసెఫ్‌ ప్రిస్ట్‌లీ అనేక పరిశోధనలు చేశారు. నాటి సమాజంలో పేరుకుపోయిన మతాచారాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం దాడులను సైతం లెక్క చేయలేదు. ఒకవైపు మత విశ్వాసాలను ప్రశ్నిస్తూనే శాస్త్రీయ అంశాలపై పరిశోధనలు చేశారు. ఆధునిక రసాయనశాస్త్ర అభివృద్ధికి తనవంతు సాయం చేశారు. ఆయన రచనలు నేటికీ ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచాయి. జోసెఫ్‌ 1804, ఫిబ్రవరి 6న పెన్సిల్వేనియాలో మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఆక్సిజన్‌ను కనుక్కుంది ఎవరు?(అఫీషియల్‌ సోల్జర్‌ జీడీ - ఏఆర్‌ఓ జోధ్‌పూర్, 2021), (అగ్నివీర్‌ ఆర్మీ జీడీ, 2023)

1) మాక్‌మిలన్‌            2) మార్కోనీ

3) జోసెఫ్‌ ప్రిస్ట్‌లీ            4) ఎవరూ కాదు

సమాధానం: 3

2. 1770లో కింది ఎవరు ఆకుపచ్చ మొక్కల పెరుగుదలలో గాలి ముఖ్య పాత్ర పోషిస్తుందని వెల్లడించే ప్రయోగాలు నిర్వహించారు?(డీడీఏ పట్వారీ, 2023)

1) జాన్‌ ఇండెన్‌హౌస్‌        2) హెన్రీ కావెండిష్‌

3) రాబర్ట్‌ బాయిల్‌        4) జోసెఫ్‌ ప్రిస్ట్‌లీ

సమాధానం: 4

3. In 1772, Joseph Priestley demonstrated that(UPPSC Civil Service 2013)
1) Plants foul the air
2) Animals purify the air during day time
3) Plants and animals restore air for each other
4) Plants get killed in the air produced by animals
Answer: 3


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram