ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌

ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఆవిష్కర్త, శాస్త్రవేత్త. టెలిఫోన్‌ సృష్టికర్తగా సుపరిచితులు. అంతేకాక ధ్వనిశాస్త్రం, స్పీచ్‌ సైన్స్, ఆప్టిక్స్, మెరైన్‌ ఇంజినీరింగ్, ఏరోనాటిక్స్‌ రంగంలో విశేష పరిశోధనలు చేశారు.


ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఆవిష్కర్త, శాస్త్రవేత్త. టెలిఫోన్‌ సృష్టికర్తగా సుపరిచితులు. అంతేకాక ధ్వనిశాస్త్రం, స్పీచ్‌ సైన్స్, ఆప్టిక్స్, మెరైన్‌ ఇంజినీరింగ్, ఏరోనాటిక్స్‌ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. ముఖ్యంగా కమ్యూనికేషన్స్‌ రంగంలో చేసిన ప్రయోగాలు విశేష ఆదరణ పొందాయి. వినికిడి లోపం ఉన్నవారి కోసం సమాచార పరికరాలను తయారు చేశారు. శబ్దాలపై అనేక పరిశోధనలు చేశారు. ‘ఫాదర్‌ ఆఫ్‌ ది టెలిఫోన్‌’గా కీర్తీగడించిన అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌ జయంతి రేపు (మార్చి 3). ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌ 1847, మార్చి 3న స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జన్మించారు. ప్రాథమిక విద్యను ఇంటివద్దే అభ్యసించారు. తండ్రి మెల్విల్లే బెల్‌ ‘విజిబుల్‌ స్పీచ్‌’లో ప్రత్యేకత కలిగి ఉన్నారు. దీంతో వినికిడి లోపం ఉన్న ఎందరో ఆయన వద్దకు చదువుకునేందుకు వచ్చేవారు. 1857లో రాయల్‌ హైస్కూల్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌లో చేరారు. అక్కడే ఆయనకు సైన్స్‌ పట్ల ఆసక్తి కలిగింది
  • 1862లో పాఠశాల విద్య ముగించుకుని లండన్‌లో తన తాత వద్దకు వెళ్లారు. ఆయన వద్ద నుంచి ధ్వనిశాస్త్రం, ప్రసంగం/ వాక్చాతుర్యం (elocution) గురించి అనేక విషయాలు నేర్చుకున్నారు
  • 1863లో స్కాట్లాండ్‌లోని ఎల్గిన్‌లో ఉన్న వెస్టన్‌ హౌస్‌ అకాడమీలో సంగీతం, వాక్చాతుర్యంలో ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. అక్కడే ధ్వనిశాస్త్రంపై అనేక పరిశోధనలు చేశారు.
  • 1865లో వీరి కుటుంబం లండన్‌కు మారింది. 1868లో యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, మెట్రిక్యులేషన్‌లో చేరారు. అయితే అది పూర్తి కాకుండానే 1870లో కుటుంబంతో కలిసి కెనడాకు వలస వెళ్లారు
  • 1871లో బోస్టన్‌ వెళ్లిన బెల్‌ అక్కడ ‘బోస్టన్‌ స్కూల్‌ ఫర్‌ డెఫ్‌ మ్యూట్స్‌’లో అధ్యాపకుడిగా చేరారు
  • 1873లో బోస్టన్‌ యూనివర్సిటీలో వోకల్‌ ఫిజియాలజీ, ఎలోక్యూషన్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అక్కడ స్పీచ్, హియరింగ్‌ మెకానిక్స్‌పై ఉపన్యాసాలు ఇచ్చారు
  • 1877లో ఆయన ‘బెల్‌ టెలిఫోన్‌ కంపెనీ’ని నెలకొల్పారు. 1881లో వాషింగ్టన్‌ డి.సి.లో వోల్టా ల్యాబొరేటరీ అసోసియేషన్‌ను స్థాపించారు. ఇది టెలీ కమ్యూనికేషన్స్, సౌండ్‌ రికార్డింగ్‌పై పరిశోధనలు చేసింది. 

పురస్కారాలు - గౌరవాలు

  • 1880లో ఫ్రెంచ్‌ ప్రభుత్వం వోల్టా ప్రైజ్‌ ప్రదానం చేసింది. 1881లో ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఈయన్ను లెజియన్‌ ఆఫ్‌ ఆనర్‌గా నియమించింది.
  • 1893-1903 వరకు నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు
  • 1902లో లండన్‌లోని రాయల్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఆయనకు ఆల్బర్ట్‌ మెడల్‌ను ప్రదానం చేసింది.
  • 1907లో అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సొసైటీ జాన్‌ ఫ్రిట్జ్‌ మెడల్‌ను ఇచ్చింది.
  • 1912లో ది ఫ్రాంక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎలియట్‌ క్రెసన్‌ మెడల్‌ అందించింది.
  • 1913లో రాయల్‌ సొసైటీ హ్యూస్‌ మెడల్‌ను ప్రదానం చేసింది. 

చివరగా..

  • అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌ పరిశోధనలు, ఆవిష్కరణలు మానవాళికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. వినికిడి, ప్రసంగం, కమ్యూనికేషన్‌లో చేసిన ప్రయోగాలు వినికిడి లోపం ఉన్నవారికి సాయపడ్డాయి. విజిబుల్‌ స్పీచ్‌ను బోధించడం నుంచి యాంత్రిక - విద్యుత్‌ కమ్యూనికేషన్‌ పరికరాల అభివృద్ధి వరకు ఆయన ప్రయాణం సాగింది. ప్రస్తుతం సమాచార సాంకేతికత ఇంతలా అభివృద్ధి చెందిందంటే నాడు బెల్‌ రూపొందించిన టెలిఫోనే కారణం. ఈయన 1922, ఆగస్టు 2న మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. టెలిఫోన్‌ను కింది ఏ దశాబ్దంలో కనుక్కున్నారు?(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2018)

1) 1670    2) 1770        3) 1870    4) 1970

సమాధానం: 3

2. Who among the following was the inventor of long distance telephone?(SSC Steno, 2017)

1) Christopher Dack            2) Neils Bohr

3) Michael Pupin             4) Alexander Graham Bell

Answer: 4

3. Who among the following invented Telephone?(OSSC CGL 2022)

1) Thomas Alva Edison        2) Alexander Graham Bell

3) Guglielmo Marconi         4) Samuel Morse

Answer: 2


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram