ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

జేమ్స్‌ చాడ్విక్‌

ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో అనేక పరిశోధనలు చేశారు.


ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో అనేక పరిశోధనలు చేశారు. అణువుల్లో న్యూట్రాన్‌ను కనుక్కున్నారు. ఇందుకుగానూ నోబెల్‌ బహుమతి అందుకున్నారు. పరమాణు కేంద్రక స్వభావాన్ని పరిశోధించారు. హైడ్రోజన్‌ అణువులోని కేంద్రకం అయిన ప్రోటాన్‌ను ఇతర అణువుల కేంద్రకాల్లో ఒక భాగంగా గుర్తించారు. న్యూట్రాన్‌ ప్రేరిత విచ్ఛిత్తితో అపారమైన శక్తి విడుదలవుతుందని తన పరిశోధనల ద్వారా నిరూపించారు. అణుబాంబును అభివృద్ధి చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడింది. మొదటి న్యూక్లియర్‌ బాంబును రూపొందించడానికి అమెరికా ఏర్పాటు చేసిన మాన్‌హట్టన్‌ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న బ్రిటిష్‌ బృందానికి చాడ్విక్‌ హెడ్‌గా పనిచేశారు. పోటీపరీక్షల కోణంలో జేమ్స్‌ చాడ్విక్‌ జీవితంలోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • జేమ్స్‌ చాడ్విక్‌ 1891, అక్టోబరు 20న ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జన్మించారు. అక్కడి సెంట్రల్‌ గ్రామర్‌ స్కూల్‌ ఆఫ్‌ బాయ్స్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు
  • 1907లో యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో చదువుకునేందుకు ఆయనకు స్కాలర్‌షిప్‌ లభించింది. దాని సాయంతో 1908లో గణితం అధ్యయనం చేసేందుకు ఆ యూనివర్సిటీకి వెళ్లి, పొరపాటున భౌతికశాస్త్ర విభాగంలో చేరారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
  • ఆ సమయంలో ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్‌ రూథర్‌ఫర్డ్‌ ఉన్నారు. ఆయన వద్ద అనేక విషయాలు నేర్చుకున్న చాడ్విక్‌ 1911లో ఫస్ట్‌క్లాస్‌ ఆనర్స్‌తో పట్టభద్రుడయ్యారు.
  • చదువుకుంటూనే రూథర్‌ఫర్డ్‌ పరిశోధనకు సాయం చేశారు. రేడియం కార్యాచరణను (activity of radium) కొలిచేందుకు, రేడియోధార్మిక వనరుల శక్తిని పోల్చడానికి ఆయన ఒక పద్ధతిని రూపొందించి 1912లో తన మొదటి పరిశోధనా పత్రంగా ప్రచురించారు. అదే ఏడాది ఆయన ఎంఎస్సీ పట్టా పొందారు. 

ముఖ్యమైన

  • 1920లో చాడ్విక్‌ ప్లాటినం, వెండి, రాగి సహా వివిధ లోహాల అణు ఛార్జ్‌లను నిర్ణయించడానికి ఆల్ఫా పార్టికల్‌ స్కాటరింగ్‌ను ఉపయోగించి ప్రయోగాలు చేశారు. దీని ఫలితంగా ఆవర్తన పట్టికలో అణువులోని అణు ఛార్జ్‌ సంఖ్యాపరంగా దాని పరమాణు సంఖ్యకు సమానమని మొదటి ప్రత్యక్ష ప్రయోగాత్మక నిర్ధారణను అందించింది
  • చాడ్విక్‌ 1932లో న్యూట్రాన్‌ కణాలను ఆవిష్కరించారు. పలుచటి బెరీలియం రేకును ఆల్ఫా కణాలతో తాడనం చేయగా, ప్రోటాన్‌ కంటే కొంచెం ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న తటస్థ కణాలు ఉద్గారమయ్యాయి. అవే న్యూట్రాన్‌లు. 

చివరగా..

  • పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లతోపాటు విద్యుత్‌ ఆవేశం లేని కణాలు ఉంటాయని ఆయన నిరూపించారు. వాటికి న్యూట్రాన్‌లు అని పేరు పెట్టారు. ఈ ఆవిష్కరణ ఆధునిక భౌతికశాస్త్రం, అణుశక్తి అభివృద్ధికి దోహదం చేసింది. అణుకేంద్రక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఈయన ప్రయోగాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అణు విచ్ఛిత్తి, అణు బాంబుల తయారీకి బాటలు చేశాయి. ఈయన 1974, జులై 24న కేంబ్రిడ్జ్‌లో మరణించారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. జేమ్స్‌ చాడ్విక్‌ కింది ఏ ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందారు?(ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్, 2024)

1) న్యూట్రాన్‌           2) కాంతి తరంగ సిద్ధాంతం

3) ఎలక్ట్రాన్‌            4) థర్మల్‌ అయనీకరణం

సమాధానం: 1

2. న్యూట్రాన్‌ను ఎవరు కనుక్కున్నారు?(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఫారెస్ట్‌ గార్డ్, ఫారెస్టర్, ఎల్‌ఎస్‌ఐ కంబైన్డ్, 2024),(ఎంపీ ఎక్సైజ్‌ కానిస్టేబుల్, 2025)

1) జేమ్స్‌ చాడ్విక్‌            2) జేజే థామ్సన్‌

3) రూథర్‌ఫర్డ్‌              4) ఐన్‌స్టీన్‌

సమాధానం: 1

3. న్యూట్రాన్‌ను కనుక్కున్నందుకు కింది ఏ సంవత్సరంలో జేమ్స్‌ చాడ్విక్‌కు నోబెల్‌ బహుమతి లభించింది?(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2023)

1) 1932        2)1933        3) 1934        4) 1935

సమాధానం: 4

4. When did James Chadwick prove the existence of the neutron – an elementary particle devoid of any electric charge?(SSC CGL Tier-II, 2025)

1) 1920        2) 1932        3) 1941        4) 1955

Answer: 2


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram