ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

జానకి అమ్మల్‌

ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ వృక్షశాస్త్రవేత్త. జన్యుశాస్త్రం, కణశాస్త్రం, పరిణామం మొదలైన రంగాల్లో విశేష పరిశోధనలు చేసి జీవశాస్త్ర అభివృద్ధికి తోడ్పాటు అందించారు.


ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ వృక్షశాస్త్రవేత్త. జన్యుశాస్త్రం, కణశాస్త్రం, పరిణామం మొదలైన రంగాల్లో విశేష పరిశోధనలు చేసి జీవశాస్త్ర అభివృద్ధికి తోడ్పాటు అందించారు. సైటోజెనెటిక్స్‌లో ప్రయోగాలు చేసి, అందులో నిపుణురాలిగా పేరొందారు. వృక్షశాస్త్రంలో పీహెచ్‌డీ పొందిన మొదటి భారతీయ మహిళగా నిలిచారు. అధిక దిగుబడి ఇచ్చే చెరకు వంగడాన్ని సృష్టించారు. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను పునర్‌వ్యవస్థీకరించడంలోనూ ఆమె కీలక భూమిక పోషించారు. తనకున్న జన్యుశాస్త్ర అవగాహనతో పర్యావరణ పరిరక్షణకూ పూనుకున్నారు. కేరళలో ‘సేవ్‌ ది సైలెంట్‌ వ్యాలీ’ ఉద్యమాన్ని ముందుండి నడిపారు. 

బాల్యం - వృత్తి జీవితం

  • జానకి అమ్మల్‌ 1897, నవంబరు 4న కేరళలోని తలస్సేరిలో జన్మించారు. పాఠశాల విద్యను గ్రామంలోని సేక్రెడ్‌ హార్ట్‌ కాన్వెంట్‌లో పూర్తి చేశారు.
  • మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1921లో వృక్షశాస్త్రంలో ఆనర్స్‌ డిగ్రీ పొందారు. 
  • ఇక్కడి సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఆమె విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించాలని భావించారు. దీనికి అనుగుణంగా అమెరికాలోని మిచిగన్‌ యూనివర్సిటీ నుంచి 1924లో బార్బర్‌ స్కాలర్‌షిప్‌ పొందారు. 
  • 1926లో మిచిగాన్‌ యూనివర్సిటీ నుంచి వృక్షశాస్త్రంలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్సీ) పట్టా పొందారు. 
  • మళ్లీ ఆమె ఓరియంటల్‌ బార్బర్‌ ఫెలోషిప్‌ పొంది డాక్టోరియల్‌ డిగ్రీ కోసం మిచిగాన్‌ యూనివర్సిటీకి వెళ్లారు. Chromosome Studies in Nicandra Physaloides పేరుతో థీసిస్‌ రాశారు. ఇందుకుగానూ 1931లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
  • 1951లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆహ్వానం మేరకు తిరిగి భారత్‌కు వచ్చారు. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ)ను పునర్నిర్మించాల్సిందిగా ఆయన జానకిని కోరారు. 

ముఖ్యమైన పరిశోధనలు

  • 1934-39 కాలంలో సైటోజెనెటిక్స్‌ ద్వారా తియ్యటి, అధిక దిగుబడి ఇచ్చే చెరకు వంగడాలను సృష్టించారు. ఆమె సాచరమ్‌ స్పాంటేనియం (అడవి చెరకు)ను ఇతర రకాలతో విజయవంతంగా సంకరీకరణం చెందించి, ఈ ఘనత సాధించారు. ఎస్‌జీ 63-32 రకం సహా అనేక రకాల హైబ్రిడ్‌ జాతులను ఆమె ఆవిష్కరించారు.
  • వంకాయ, మాగ్నోలియాస్‌ (ఒక రకమైన పూల జాతి), ఇతర పంటల మెరుగైన రకాలను అభివృద్ధి చేయడంపైనా ఆమె పనిచేశారు.

సైలెంట్‌ వ్యాలీ రక్షణ ఉద్యమం

  • సైలెంట్‌ వ్యాలీ అనేది కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో ఉన్న ఉష్ణమండల సతత హరిత ప్రాంతం. ఆ అడవి అనేక రకాల ప్రత్యేకమైన వృక్షజాతులకు నిలయంగా ఉంది. 1973లో కేరళ ప్రభుత్వం ఆ ప్రదేశం మీదుగా ప్రవహిస్తోన్న కుంతిపూజ నదిపై జలవిద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించాలని భావించింది. ఇది కడితే అక్కడి వృక్ష, జంతు జాతులకు తీవ్ర నష్టం కలుగుతుందని, వాటిలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతులు ఎక్కువగా ఉన్నాయని జానకి అమ్మల్‌ వాదించారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దీంతో ప్రజలంతా ఏకమై నిలిపివేత కోసం ఉద్యమించారు. ఆమె మరణించాక 1985లో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని సైలెంట్‌ వ్యాలీ నేషనల్‌ పార్క్‌గా ప్రకటించింది. 

చివరగా

  • జానకి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, కట్టుబాట్లను ఎదిరించి ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగారు. భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 2000లో జానకి అమ్మల్‌ నేషనల్‌ అవార్డ్‌ పేరుతో పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. రాయల్‌ హార్టీకల్చరల్‌ సొసైటీ సృష్టించిన ఒక రకమైన మాగ్నోలియాకు ‘జానకి అమ్మల్‌’ అని పేరు పెట్టింది. నూతన వంగడాల సృష్టితోపాటు పర్యావరణ పరిరక్షణలోనూ ఆమె ముందున్నారు. జానకి 1984, ఫిబ్రవరి 7న మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

Q: వృక్షశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందిన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు?

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2018)

1) అర్చనన్‌ శర్మ            2) విజయ లక్ష్మీ సక్సేనా

3) మంజు శర్మ            4) జానకి అమ్మల్‌

సమాధానం: 4

(MP Patwari, 2017)

Q: Who among the following co-authored Chromosome Atlas of Cultivated Plants along with C.D. Darlington?
1) John Gribbin            2) Gala Vince
3) Janaki Ammal        4) C. V. Subramanian
Answer: 3

(Haryana Civil Services 2019)

Q: Consider the following statements regarding Janaki Ammal:
a) She was a pioneering Indian botanist known for her work on sugarcane cytogenetics.
b) She was the first woman scientist to receive the Padma Vibhushan.
c) She co-authored “The Chromosome Atlas of Cultivated Plants.”
d) She worked at the Royal Horticultural Society, London.
Which of the above statements are correct?
1) a, b, c     2) b, c, d
3) a, c, d     4) All are correct
Answer: 3


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram