భారత స్వాతంత్య్రోద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించడంతోపాటు బ్రిటిష్ ప్రభుత్వం అన్యాయంగా పౌర హక్కులకు వ్యతిరేకంగా తెచ్చిన శాసనాలను ఉద్దేశపూర్వకంగా, శాంతియుతంగా ఉల్లంఘించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది పూర్ణ స్వరాజ్ (సంపూర్ణ స్వాతంత్య్రం) లక్ష్యంగా సాగింది. సహాయ నిరాకరణోద్యమం (1920) తర్వాత స్వరాజ్య పోరాటంలో రెండో ప్రధాన ప్రజా ఉద్యమంగా ఇది పేరుగాంచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉప్పును తయారు చేసి బ్రిటిష్ శాసనాలను ఉల్లంఘించాలనుకున్న గాంధీజీ 1930 మార్చి 12న సబర్మతి నుంచి దండికి కాలినడకన పయనమై శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. పోటీ పరీక్షల కోణంలో దీని గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
శాసనోల్లంఘన ఉద్యమ నేపథ్యం
మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 1928, డిసెంబరులో కలకత్తాలో కాంగ్రెస్ మహాసభ జరిగింది. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్) ఇవ్వాలని, లేకపోతే సంపూర్ణ స్వరాజ్యం కోసం ఉద్యమిస్తామని బ్రిటిష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఏడాదిలోగా బ్రిటిష్ ప్రభుత్వం అధినివేశ ప్రతిపత్తి ఇవ్వకపోతే సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటాన్ని, దాని సాధనకు శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని గాంధీజీ ప్రకటించారు.
చివరగా..
సంపూర్ణ స్వరాజ్య సాధనే ధ్యేయంగా సాగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మహోన్నత ఘట్టంగా నిలిచింది. రైతులు, మహిళలు, వ్యాపారులు, యువకులు సహా సమాజంలోని అన్ని వర్గాలవారు ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది భారతీయుల్లో స్వతంత్ర కాంక్షను రగిల్చింది. ఉద్యమకారులు బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించడంతోపాటు విదేశీ వస్తువులను బహిష్కరించడం ద్వారా వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. స్థానిక కుటీర పరిశ్రమలకు చేయూతనిచ్చారు. ఈ పోరాటం తర్వాతి కాలంలో భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది.
శాసనోల్లంఘన ఉద్యమ నేపథ్యం, గాంధీజీ ప్రతిపాదించిన డిమాండ్లు, ఉద్యమం జరిగిన తీరు, ఇతర ప్రాంతాల్లో ముందుండి నడిపిన నాయకులు, యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎస్‌ఎస్ సీ సీజీఎల్‌సహా పలు పోటీ పరీక్షల్లో ఈ అంశంపై అడిగిన బహుళైచ్ఛిక ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఉచిత ఈబుక్ కోసం ఈనాడు ఈప్రతిభ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. https://hov.to/0c0f8895
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. దండి మార్చ్ ఎప్పుడు ప్రారంభమైంది?
(గుజరాత్ పీఎస్‌ఐ ప్రిలిమ్స్, 2017),
(డీఎంఆర్‌సీ సీఆర్‌ఏ, 2020)
1) 1930, మార్చి 12 2) 1931, మార్చి 12
3) 1932, ఏప్రిల్ 6 4) 1930, ఏప్రిల్ 6
సమాధానం: 1
2. తమిళనాడులో ఉప్పుసత్యాగ్రహ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు?
(ఎస్‌ఎస్‌సీ జేఈ ఎంఈ, 2019), (టీఎన్‌యూఎస్‌ఆర్‌బీ, 2012),
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2022), (రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్, 2022)
1) సుబ్రమణ్య భారతి 2) సి.రాజగోపాలచారి
3) భారతిదాసన్ 4) శ్రీనివాస శాస్త్రి
సమాధానం: 2
3. మహాత్మా గాంధీతో కలిసి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ ఎవరు?
(పశ్చిమ బెంగాల్ పోలీస్ కానిస్టేబుల్, 2015)
1) అనిబిసెంట్ 2) మృదులా సారాభాయ్
3) ముత్తులక్ష్మి 4) సరోజినీ నాయుడు
సమాధానం: 4
4. దండి మార్చ్ ఎన్ని రోజులు సాగింది?
(బీపీఎస్సీ 66 కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్, 2022)
1) 10 రోజులు 2) 20 రోజులు 3) 24 రోజులు 4) 30 రోజులు
సమాధానం: 3
Link copied to clipboard!
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఎన్ఐటీ సిక్కింలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
సిపెట్‌లో లెక్చరర్ పోస్టులు
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
సెంటర్ ఫర్ డివెలప్‌మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్లో కన్సల్టెంట్ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో పారామెడికల్, ఓవర్సీర్, టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్సీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఐఐటీ తిరుపతిలో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా రవిచంద్రన్
జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సాధ్వీ నిరంజన్‌జ్యోతి