ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఎడ్వర్డ్‌ ఫ్రాంక్లాండ్‌

ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ రంగంలో విశేష పరిశోధనలు చేశారు


ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. ఆర్గానోమెటాలిక్‌ కెమిస్ట్రీ స్థాపకుల్లో ఒకరు. మూలకాలు స్థిర నిష్పత్తుల్లో మిళితం అవుతాయని ప్రతిపాదించారు. వేలన్సీ భావనను అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈయన్ను ‘వేలన్సీ పితామహుడిగా’ (Father of Valency) పేర్కొంటారు. లండన్‌లో నీటి నాణ్యతను అధ్యయనం చేశారు. హీలియం మూలకాన్ని కనుక్కున్నారు. తన ప్రయోగాలు, ఆవిష్కరణల ద్వారా రసాయనశాస్త్ర అభివృద్ధికి తోడ్పాటు అందించారు. జనవరి 18న ఎడ్వర్డ్‌ ఫ్రాంక్లాండ్‌ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • ఎడ్వర్డ్‌ ఫ్రాంక్లాండ్‌ 1825, జనవరి 18న ఇంగ్లండ్‌లోని కాటెరాల్‌లో జన్మించారు. 1833లో జేమ్స్‌ వాలసే ప్రైవేట్‌ పాఠశాలలో చేరారు. అప్పుడే ఆయనకు రసాయనశాస్త్రంపై ఆసక్తి కలిగింది. జోసెఫ్‌ ప్రీస్ట్లీ (ఈయన కృత్రిమంగా ఆక్సిజన్‌ తయారీ విధానాన్ని కనుక్కున్నారు) రచనలు చదవడం ప్రారంభించారు.
  • 1840లో లాంకాస్టర్‌లో స్టీఫెర్‌ రాస్‌ అనే డ్రగ్గిస్ట్‌ వద్ద అప్రెంటిస్‌గా చేరారు. వివిధ రసాయన సమ్మేళనాలను కలపడం ద్వారా ఔషధాల తయారీపై పట్టు పెంచుకున్నారు.
  • 1845లో లియోన్‌ ప్లేఫెయిల్‌ ప్రయోగశాలలో పని చేసేందుకు లండన్‌ వెళ్లారు. అక్కడ జర్మన్‌ శాస్త్రవేత్త ఏడబ్ల్యూహెచ్‌ కోల్బేను కలిశారు. ఆయన వద్ద నుంచి వాయు విశ్లేషణ పద్ధతులను నేర్చుకున్నారు.
  • 1847లో జర్మనీ వెళ్లి మార్బర్గ్‌ యూనివర్సిటీలో చేరారు. అక్కడ రాబర్ట్‌ బన్సెల్‌ ఆధ్వర్యంలో అనేక పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. అక్కడే ఆర్గానోమెటాలిక్‌ కెమిస్ట్రీ, వేలన్సీలో కీలక ఆవిష్కరణలు చేశారు. తర్వాత గియోస్సెన్‌లోని జస్టస్‌ వాన్‌ లైబిగ్‌ ప్రయోగశాలలో చేరారు.
  • 1849లో మార్బర్గ్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
  • 1851లో ఇంగ్లండ్‌ తిరిగి వచ్చి మాంచెస్టర్‌లోని ఓవెన్స్‌ కాలేజీలో రసాయనశాస్త్ర అధ్యాపకుడిగా చేరారు.
  • 1857లో లండన్‌లోని సెయింట్‌ బార్తోలోమేవ్స్‌ (St Bartholomew's) బోధనా ఆసుపత్రిలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా నియమితులయ్యారు.
  • 1863లో లండన్‌లోని రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ అయ్యారు.
  • 1865లో రాయల్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌లో బోధనా ఆచార్యుడిగా చేరారు. 20 ఏళ్లపాటు అందులోనే పనిచేశారు. 

పురస్కారాలు - గౌరవాలు

  • 1852లో అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ నుంచి కెమికల్‌ బ్రేక్‌త్రూ అవార్డు పొందారు.
  • 1853లో రాయల్‌ సొసైటీ ఫెలోగా నియమితులయ్యారు.
  • 1868లో నదుల కాలుష్యంపై ఏర్పాటైన సెకండ్‌ రాయల్‌ కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు.
  • సేంద్రీయ సమ్మేళనాల రాడికల్స్‌ ఐసోలేషన్‌పై చేసిన పరిశోధనకు రాయల్‌ మెడల్‌ (1857), కాప్లీ మెడల్‌ (1894) పొందారు.
  • 1871-73 కాలంలో కెమికల్‌ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 1897లో నైట్‌హుడ్‌ బిరుదు పొందారు.

చివరగా

  • ఆధునిక రసాయనశాస్త్ర నిర్మాణానికి కృషి చేసిన ప్రముఖ వ్యక్తుల్లో ఎడ్వర్డ్‌ ఫ్రాంక్లాండ్‌ ఒకరు. ఈయన ఆర్గానోమెటాలిక్‌ కెమిస్ట్రీ, థియరీ ఆఫ్‌ వేలన్సీకి (సంయోజకత సిద్ధాంతం) వ్యవస్థాపక పితామహుడిగా పేరొందారు. వివిధ రకాల బొగ్గుల నుంచి వెలువడే వాయువులను సమగ్రంగా విశ్లేషించిన మొదటి వ్యక్తి ఈయనే. రసాయన సూత్రాలను రాయడానికి ఉపయోగించే సంకేత పద్ధతిని కూడా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఫ్రాంక్లాండ్‌ 1899, ఆగస్టు 9న మరణించారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: రసాయనశాస్త్రంలో వేలన్సీ అనే భావనను ఎవరు కనుక్కున్నారు?

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2021)

1) ఎడ్వర్డ్‌ ఫ్రాంక్లాండ్‌       2) జోసెఫ్‌ డాల్టన్‌ హుకర్‌

3) థామస్‌ హెన్రీ              4) రాబర్ట్‌ బన్‌సన్‌

సమాధానం: 1

ప్రశ్న: ఎడ్వర్డ్‌ ఫ్రాంక్లాండ్‌ వేెలన్సీ సిద్ధాంతాన్ని ఎప్పుడు ప్రతిపాదించారు?

(యూపీ పీజీటీ (కెమిస్ట్రీ) 2016)

1) 1851            2) 1852        3) 1853        4) 1854

సమాధానం: 2

1) 1851            2) 1852        3) 1853        4) 1854
Ans: 2
Q: Helium was discovered by Frankland and ......
(RRB NTPC Graduate Level, 2025)
1) Crooks            2) Rutherford
3) Lockyer            4) Dorn
Ans: 3
Q: The intermediate compound formed in Frankland’s reaction is:
(CUET UG (Chemistry), 2024)
1) diethylzinc            2) dimethylzinc 
3) dibutylzinc            4) diarylzinc
Ans: 1
Q: Who is known as the Father of Valency?
(OPSC OAS 2016)
1) Edward Frankland             2) Henry Moseley
3) Alfred Werner                    4) None of the above
Ans: 1


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram