కోల్‌కతాలోని తూర్పు సైనికదళం ప్రధాన కార్యాలయంలో 2025, సెప్టెంబరు 15న 16వ ఉమ్మడి కమాండర్ల సదస్సు (సీసీసీ)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు.
భారత సాయుధ దళాలు 2047 నాటికి సాధించాల్సిన లక్ష్యాలపై దార్శనిక పత్రం ఆవిష్కరించారు.
రక్షణ రంగంలో మరింత స్వయంసమృద్ధి సాధించి, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా నవకల్పనలతో సన్నద్ధం కావాలని దేశ రక్షణ బలగాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
రెండేళ్లకోసారి ఈ తరహా సదస్సును మూడురోజులపాటు నిర్వహిస్తుంటారు.