దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే సమర్థ ప్రణాళికలు, వాటి అమలుతోనే సాధ్యం. స్వాతంత్య్రానంతరం దేశ ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీర్చేందుకు అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించాలంటే ప్రణాళికలతో కూడిన ఆచరణ అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ ఉద్దేశంతోనే కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారా 1950, మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ప్రధాని అధ్యక్షులు కాగా, వాస్తవ కార్యనిర్వహణాధికారి ఉపాధ్యక్షులు.
పంచవర్ష ప్రణాళికలు - వాటి ప్రధాన లక్ష్యాలను పరిశీలిస్తే..
ప్రణాళిక | కాలం | లక్ష్యాలు |
1వ | 1951-56 | వ్యవసాయం, నీటిపారుదల అభివృద్ధి |
2వ | 1956-61 | భారీ పరిశ్రమల అభివృద్ధి, సత్వర పారిశ్రామికీకరణ |
3వ | 1961-66 | స్వయం సమృద్ధితో కూడిన వృద్ధి |
4వ | 1969-74 | స్థిరత్వంతోకూడిన వృద్ధి, స్వావలంబన దిశగా పురోగతి |
5వ | 1974-79 | పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన |
6వ | 1980-85 | నిరుద్యోగ నిర్మూలన |
7వ | 1985-90 | ఆహార ఉత్పత్తి, ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచడం |
8వ | 1992-97 | మానవ వనరుల అభివృద్ధి |
9వ | 1997-2002 | సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి |
10వ | 2002-07 | సమానత్వం, సాంఘిక న్యాయం, నాణ్యమైన మానవ వనరులను పెంచడం |
11వ | 2007-12 | సత్వర, సమ్మిళిత వృద్ధి |
12వ | 2012-17 | సత్వర, సుస్థిర, మరింత సమ్మిళిత వృద్ధి |