భారతదేశ త్రివిధ దళాలు వివిధ రకాల విన్యాసాలు నిర్వహిస్తుంటాయి. ఇవి యుద్ధ క్షేత్రంలో జరగని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సైనిక విన్యాసాలు. స్వదేశీ సాయుధ దళాల బలోపేతానికి, ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తారు. ఇవి వివిధ మిలటరీ వ్యవస్థల సమన్వయానికి కూడా దోహదపడతాయి.
విన్యాసం పేరు | పాల్గొనే దేశాలు | పాల్గొనే దళం |
ఎ) సంప్రీతి బి) బోంగోసాగర్ | భారత్ - బంగ్లాదేశ్ | ఎ) ఆర్మీ బి) నేవీ |
నొమాడిక్ ఎలిఫెంట్ | భారత్, మంగోలియా | ఆర్మీ |
ధర్మ గార్డియన్ | భారత్, జపాన్ | ఆర్మీ |
అజేయ వారియర్ | భారత్, బ్రిటన్ | ఆర్మీ |
ఎ) శక్తి బి) వరుణ | భారత్, ఫ్రాన్స్ | ఎ) ఆర్మీ బి) నేవీ |
ఎస్‌ఐఎంబీఈఎక్స్ (సింబెక్స్) | భారత్, సింగపూర్ | నేవీ |
ఎ) యుద్ధ్ అభ్యాస్, వజ్రప్రహార్ బి) టైగర్ ట్రయంఫ్ |
భారత్, అమెరికా | ఎ) ఆర్మీ బి) నేవీ |
డెసర్ట్ ఈగల్ | భారత్, యూఏఈ | ఎయిర్‌ఫోర్స్ |
సంవేదన | భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, నేపాల్ | ఎయిర్‌ఫోర్స్ |
మలబార్ | ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్ | నేవీ |