• అడవులు వివిధ రకాల జంతువులు, మొక్కలు - వృక్షాలకు నిలయం. భూమిపై పర్యావణ సమతౌల్యాన్ని కాపాడటంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం వాతావరణ మార్పులు, మానవ చర్యల ఫలితంగా అడవులు తరిగిపోతున్నాయి. దీంతో ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లుతోది. వన్యప్రాణులకు నివాసం లేక, జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. వేట, వన్యప్రాణుల అక్రమ రవాణా వల్ల కూడా ఇవి అంతరించిపోతున్నాయి. ఇది జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది
• వన్యప్రాణులు, సహజ వృక్ష సంపద రక్షణ కోసం ప్రభుత్వం జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. చెరువులు, సరస్సులు, చిత్తడి ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది.
• ఏదైనా భౌగోళిక ప్రాంతాల్లో మానవ కార్యకలాపాల వల్ల అంతరించిపోయే దశలో ఉన్న వన్యప్రాణులు, ప్రకృతి సంపదను రక్షించేందుకు ఏర్పాటు చేసిన ఆవాసాలు/రక్షిత ప్రాంతాలను జాతీయ పార్కులు అంటారు. వీటికి నిర్ణీత సరిహద్దులు ఉంటాయి. ఈ హద్దులను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వీటిల్లో ప్రైవేట్ కార్యకలాపాలు నిషేధం. అంటే వంట చెరకు సేకరణ, పశువులను మేపడం, అటవీ ఉత్పత్తులను సేకరించడం, వ్యవసాయ కార్యకలాపాలు చేయకూడదు.
• వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి చెందిన నేషనల్ వైల్డ్ లైఫ్ డేటాబేస్ సెంటర్ ప్రకారం, భారతదేశంలో 106 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. అవి మొత్తం 44,402.95 చ.కి.మీ. ఇది దేశంలోని భౌగోళిక ప్రాంతంలో 1.35%.
• మన దేశంలో అత్యధిక జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం - మధ్యప్రదేశ్ (11), కేంద్రపాలిత ప్రాంతం - అండమాన్ నికోబార్ దీవులు (9).
• ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో 3 జాతీయ పార్కులు ఉన్నాయి.
• దేశంలో 104వ జాతీయ పార్కు కునో (మధ్యప్రదేశ్), 105వ జాతీయ పార్కు దేహింగ్ పాట్కాయ్ (అసోం), 106వ జాతీయ పార్కు రైమాన్ (అసోం).
• జాతీయ పార్కులు లేని రాష్ట్రం పంజాబ్.
భారతదేశంలో టాప్-10 అతిపెద్ద జాతీయ ఉద్యానవనాలను పరిశీలిస్తే..
పేరు | విస్తీర్ణం (చ.కి.మీలలో) | ఏర్పాటు | రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం |
వన్యప్రాణులు |
1. హెమిస్ నేషనల్ పార్క్ | 4400 | 1981 | లద్దాఖ్ | మంచు చిరుతలు |
2. డిసెర్ట్ నేషనల్ పార్క్ | 3162 | 1981 | రాజస్థాన్ | గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ |
3. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ | 2750 | 1980 | ఒడిశా | రాయల్ బెంగాల్ టైగర్, ఆసియా ఏనుగు |
4. గంగోత్రి నేషనల్ పార్క్ | 2390 | 1989 | ఉత్తరాఖండ్ | మంచు చిరుత |
5. నమ్దఫా నేషనల్ పార్క్ | 1985.23 | 1974 | అరుణాచల్ ప్రదేశ్ | ఎగిరే ఉడుత, ఆసియా అడవి కుక్క (ధోల్) |
6. కాంచన్‌జంగ్ నేషనల్ పార్క్ | 1784 | 1977 | సిక్కిం | మంచు చిరుత |
7. గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్ | 1,440 | 1981 | ఛత్తీస్‌గఢ్ | పులులు |
8. గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ | 1410.30 | 1965 | గుజరాత్ | ఆసియా సింహం |
9. సుందర్‌బన్స్ నేషనల్ పార్క్ | 1330.10 | 1984 | పశ్చిమ బెంగాల్ | రాయల్ బెంగాల్ టైగర్ |
10. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ | 1318 | 1936 | ఉత్తరాఖండ్ | రాయల్ బెంగాల్ టైగర్ |