ప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్‌ను స్థాపించారు. దేశంలో మొదటి బయోస్ఫియర్ నీలగిరి. 2025, జూన్ నాటికి దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లున్నాయి. వీటిలో 12 యునెస్కో వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ (డబ్ల్యూఎన్‌బీఆర్) గుర్తింపు పొందాయి.
ముఖ్యాంశాలు:
భారతదేశం బయోస్ఫియర్ రిజర్వ్‌లు
పేరు | రాష్ట్రం | ప్రాంతం | జంతువులు | సంవత్సరం |
---|---|---|---|---|
నీలగిరి ♠ | తమిళనాడు, కేరళ, కర్ణాటక | బందీపూర్, సైలెంట్ వ్యాలీ, సిరువాని కొండలు | సింహాలు | 1986 |
నందాదేవి ♠ | ఉత్తరాఖండ్ | చమోలీ, బాగేశ్వర్, పితోర్ ఘర్ | - | 1988 |
నోక్‌రేక్ ♠ | మేఘాలయ | గారో కొండలు | ఎర్ర పాండా | 1988 |
గ్రేట్ నికోబార్ ♠ | అండమాన్, నికోబార్ | దక్షిణ దీవులు | ఉప్పునీటి తాబేలు | 1989 |
గల్ఫ్ ఆఫ్ మన్నార్ ♠ | తమిళనాడు | రామేశ్వరం, కన్యాకుమారి | - | 1989 |
మానస్ | అస్సాం | కోక్రాజర్, బొంగైగామ్, నల్ బారీ | పాండా, గోల్డెన్ లంగర్ | 1989 |
సుందర్ బన్స్ ♠ | పశ్చిమ బెంగాల్ | బ్రహ్మపుత్ర, గంగా-డెల్టా | రాయల్ బెంగాల్ పులులు | 1989 |
సిమ్లిపాల్ ♠ | ఒడిశా | మయూర్ భంజ్ | - | 1994 |
దిబ్రు-సైఖోవా | అస్సాం | డిబ్రూఘర్, టీన్స్ ఘకియా | గోల్డెన్ లంగర్ | 1997 |
దేహంగ్-దిబంగ్ | అరుణాచల్ ప్రదేశ్ | దిబంగ్ లోయలు | - | 1998 |
పంచ్ మర్హి ♠ | మధ్యప్రదేశ్ | బేటూల్, చిద్వారా, ఒషింగాబాద్ | ఉడుతలు | 1999 |
ఖంగ్ చంగ్ జోన్డ్ ♠ | సిక్కిం | ఖంగ్ చంగ్ జోన్ డ్డా | చిరుతలు, ఎర్ర పాండా | 2000 |
అగస్తమలై ♠ | కేరళ, తమిళనాడు | నేయర్ పెప్పారా, నీలగిరి | తహర్, ఏనుగులు | 2001 |
అమర్ కంఠక్ | మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ | అణుపూర్, దిండోరి, బిలాస్‌పూర్ | - | 2005 |
రాణ్ ఆఫ్ కచ్ | గుజరాత్ | రాజ్‌కోట్, కుచ్, పఠాన్ సురేంద్రనగర్ | ఇండియన్ గాడిదలు | 2008 |
కోల్డ్ డిసెర్ట్ | హిమాచల్ ప్రదేశ్ | ఫిన్వాలీ నేషనల్ పార్క్ | మంచు చిరుత | 2009 |
శేషాచలం కొండలు | ఆంధ్రప్రదేశ్ | చిత్తూరు, కడప | - | 2010 |
పన్నా♠ | మధ్యప్రదేశ్ | పన్నా, చత్తూర్పూర్ | - | 2011 |
♠ గుర్తు ఉన్నవి యునెస్కో రక్షిత బయోస్ఫియర్ రిజర్వులు