భూమి ఉపరితలం అకస్మాత్తుగా కంపించడాన్ని భూకంపం అంటారు. భూ గర్భంలో సంభవించే ఆకస్మిక బలాల వల్ల ఏర్పడే తరంగాల కారణంగా భూమి కంపిస్తుంది. ప్రకృతి విలయాల్లో ఇది ప్రధానమైంది. దీనివల్ల పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాలు కలుగుతాయి. సాధారణంగా ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో భూ ప్రకంపనలు ఉంటాయి.
- భూకంపం ఏర్పడే ప్రాంతాన్ని ‘భూకంప నాభి’ లేదా ‘భూకంప కేంద్రం’ అంటారు. పైభాగంలో భూమి ఉపరితలం మీద లంబంగా ఉండే ప్రాంతాన్ని ‘ఆది కేంద్రం’ అంటారు. దీని నుంచి దూరంగా వెళ్లే కొద్దీ ప్రకంపనల తీవ్రత తగ్గుతుంది.
- భారతదేశ భూ విస్తీర్ణంలో 58% భూభాగం భూకంప దుర్భలత్వంలో ఉంది. మన దేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో భూకంపాలు అధికంగా సంభవిస్తుండగా.. తరచుగా అస్సాం, బిహార్, జమ్మూ, గుజరాత్, మహారాష్ట్రలో వస్తున్నాయి.
- భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని సిస్మోగ్రాఫ్ (భూకంప లేఖిని) అంటారు. వీటి తీవ్రతను రిక్టర్ స్కేల్‌తో కొలుస్తారు. దీన్ని 1935లో చార్లెస్ ఎఫ్ రిక్టర్ తయారు చేశారు. దీనిపై మొత్తం 9 పాయింట్లు ఉంటాయి. కొలత 7 కంటే ఎక్కువ నమోదైతే దాన్ని తీవ్ర భూకంపంగా పేర్కొంటారు.
- ప్రపంచంలో భూకంపాలు 68% పసిఫిక్ మహాసముద్రం, 21% మధ్యధరా ప్రాంతాలు, 11% ఇతర ప్రాంతాల్లో సంభవిస్తాయి. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఎలాంటి భూకంపాలు నమోదు కాలేదు. ప్రపంచంలో సంభవించిన అధిక తీవ్రత గల వివిధ భూకంపాలు, మృతుల సంఖ్యను పరిశీలిస్తే..
తేదీ |
ప్రాంతం |
దేశం |
తీవ్రత |
మృతులు |
22.05.1960 |
వాల్‌దివియా |
చిలీ |
9.5 |
1655 |
28.03.1964 |
ప్రిన్స్ విలియంసౌండ్ |
అమెరికా |
9.2 |
128 |
26.12.2004 |
సుమత్ర |
ఇండోనేసియా |
9.1 |
2,27,900 |
11.03.2011 |
సెండాయ్ |
జపాన్ |
9.0 |
10000 |
27.02.2010 |
బియో-బియో |
చిలీ |
8.8 |
521 |
12.05.2008 |
తూర్పు సిచువాన్ |
చైనా |
7.9 |
87,500 |
26.01.2001 |
గుజరాత్ |
భారత్ |
7.6 |
20,000 |
17.08.1999 |
ఇజ్మిత్ |
తుర్కియే |
7.6 |
18,000 |
05.30.1998 |
బదాక్షాన్ |
ఆఫ్గనిస్థాన్ |
6.6 |
4,000 |
27.05.2006 |
జావా |
ఇండోనేసియా |
6.3 |
5,700 |