జార్జియా మెలోనీతో మోదీ భేటీ

జార్జియా మెలోనీతో మోదీ భేటీ
  • అయిదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 20న ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రస్తుతమున్న ప్రత్యేక వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఇటలీ నిర్ణయించాయి. వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికతల్లో మరింతగా సహకరించుకోవాలని నిశ్చయించాయి. 
  • 2025-29కి సంబంధించిన సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికపైనా సమీక్ష జరిపామని మోదీ వివరించారు. దీని అమలు కోసం రెండు దేశాల విదేశాంగశాఖల మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram