రేబిస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన లూయిస్ పాశ్చర్ మరణించిన రోజుకి గుర్తుగా ఏటా సెప్టెంబరు 28న ‘వరల్డ్ రేబిస్ డే’గా నిర్వహిస్తారు. రేబిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యం కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
రేబిస్ గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే లక్ష్యంతో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అమెరికా, అలయెన్స్ ఫర్ రేబిస్ కంట్రోల్, డబ్ల్యూహెచ్‌ఓ సంయుక్తంగా ‘వరల్డ్ రేబిస్ డే’ను ఏర్పాటు చేశాయి.
2007, సెప్టెంబరు 28న దీన్ని మొదటిసారి నిర్వహించారు.
2025 నినాదం: “Act Now: You, Me, Community”