ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

మానవుడికి అవసరమైన వస్తు, సేవల ఉత్పత్తికి ఉపయోగపడే పదార్థాలు, శక్తి లాంటి వాటిని సహజ వనరుల రూపంలో ప్రకృతి అందిస్తోంది. పర్యావరణాన్ని, సహజ వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జులై 28న ‘ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం’గా (World Nature Conservation Day) నిర్వహిస్తారు. సహజ సంపదను సరైన రీతిలో ఉపయోగిస్తూ, భవిష్యత్తు తరాల వారికి వీటిని అందించాల్సిన ప్రాధాన్యత గురించి ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉన్న ఆర్టికల్‌ 48తి ప్రకారం దేశంలోని అటవీ, వన్యప్రాణి సంపదను సంరక్షిస్తూ దేశ పర్యావరణాన్ని కాపాడాలనే నియమానికి అనుగుణంగా మన దేశంలో ప్రకృతి వనరులను పరిరక్షిస్తున్నారు. 2014లో 745 రక్షిత ప్రాంతాలు ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 1022కి చేరింది. ఇవి భారత భౌగోళిక విస్తీర్ణంలో 5.43%.
  • 2024, డిసెంబరు 21న విడుదలైన భారతదేశ అటవీ నివేదిక-2023 (ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌) ప్రకారం, భారతదేశ ఫారెస్ట్, ట్రీ కవర్‌ 8,27,357 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇది భారత భౌగోళిక విస్తీర్ణంలో 25.17%. 2021తో పోల్చితే ఇది 1445 చ.కి.మీ. పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అటవీ విస్తీర్ణం 2023 నాటికి 30,084.96 చ.కి.మీ. తెలంగాణలో ఇది 21,179.04 చ.కి.మీ.లుగా ఉంది.
  • 2014లో 59గా ఉన్న రామ్‌సర్‌ సైట్ల సంఖ్య 2026, జులై నాటికి 100కి చేరుకుంది, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఉన్న జయప్రకాశ్‌ నారాయణ్‌ (జేపీ) పక్షి సంరక్షణ కేంద్రాన్ని దేశ వందో రామ్‌సర్‌ సైట్‌గా గుర్తించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2026, జూన్‌ 5న ప్రకటించారు. 2026 జులై నాటికి 18 రాష్ట్రాల్లో 58 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటిని ప్రాజెక్ట్‌ టైగర్‌ కింద నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) నిర్వహిస్తోంది.

చారిత్రక నేపథ్యం

‘మానవ పర్యావరణం’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) 1972 జూన్‌ 5న స్టాక్‌హోంలో ఒక సమావేశం నిర్వహించింది. దీనిలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రకృతి వనరుల వినియోగంపై అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. ప్రకృతి రక్షణ - అవసరంపై అందరూ ఆలోచించేలా ఏటా జులై 28న ‘ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని’ జరుపుకోవాలని ఈ సందర్భంగా తీర్మానించారు.

ప్రకృతి పరిరక్షణకు భారత్‌ అమలు చేసిన చట్టాలు, గతంలో ఈ టాపిక్‌పై ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, టీఎస్‌పీఎస్సీ స్టెనో, టైపిస్ట్‌ జూనియర్‌ అసిస్టెంట్, టీఎస్‌పీఎస్సీ ఏఈ, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ, జేఈ, ఎన్‌టీపీసీ టైర్‌-1, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 75కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఫ్యాక్టరీల చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు?

(ఎంపీపీజీసీఎల్‌ ప్లాంట్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌), 2024)

1) 1968        2) 1958       3) 1938        4) 1948

సమాధానం: 4

2. నీటి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

(కేపీఎస్సీ ఏఈ, 2018)

1) 1974   2) 1981   3) 1986   4) 2010

సమాధానం: 1

3. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2021), (కేపీఎస్సీ కేఏఎస్‌ ప్రిలిమ్స్, 2020),

(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ ప్రహారీ కంబైన్డ్‌ ఎగ్జామ్, 2023), 

1) జులై 12         2) ఆగస్టు 5        3) జులై 28           4) మే 30

సమాధానం: 3

4. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు?

(యూపీ టెట్, 2017)

1) 1960        2) 1962          3) 1972        4) 1975

సమాధానం: 3

5. Government of India has passed the Environment (Protection) Act, in the year
(APSSB Forest Guard, 2022)
1) 1976        2) 1986        3) 1956        4) 1996
Ans: 2
6. National Green Tribunal Act come into force on which date?
(UGC NET, 2025)
1) 18 Oct 2010        2) 18 Nov 2010
3) 8 Oct 2010        4) 8 Nov 2010
Ans: 1
7. What does the Environment (Protection) Act, 1986 commonly refer to?
(UP Police SI, 2026)
1) Aspects relating only to water pollution control
2) Aspects relating only to regulating noise pollution
3) Narrow-focused regulation on air pollution
4) Umbrella legislation for environmental protection
Ans: 4
8. Consider the following statements on Wildlife (Protection) Act of 1972.
i. Bharal and Musk deer found in Uttarakhand are comprised in Schedule 1 of Wildlife (Protection) Act of 1972.
ii. Hornbill is included in Schedule 2.
Which of the above statement is/are correct?
(UKSSSC VDO, 2023)
1) Only i        2) Only ii        3) Both i and ii        4) Neither i nor ii
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram